రాహుల్ ద్రవిడ్ గత కొన్నేళ్లుగా భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా రాణిస్తున్నాడు. త్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్ క్రికెట్ సిరీస్‌తో అతని పదవీకాలం ముగియనుండడంతో మళ్లీ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవడానికి అతను ఇష్టపడలేదు.భారత హెడ్ కోచ్ పదవికీ కొందరు విదేశీ మాజీ క్రికెటర్లు కూడా ఆసక్తి చూపారు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ , చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పదవికీ ఆసక్తి చూపినట్టు సమాచారం.
టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్!
భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ ను ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ గా నియామకం దాదాపు ఖరారైనట్టు కనిపిస్తుంది.ప్రస్తుత కోచ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న రాహుల్ ద్రావిడ్ టీ20 వరల్డ్ కప్ తర్వాత పదవీకాలం ముగియనుంది.అయితే గంభీర్ నియామకం పై బీసీసీఐ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
New Update
కొద్ది రోజులకు ముందు (బీసీసీఐ) భారత క్రికెట్ బోర్డు కోచ్ పదవికి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ నెల 27 వరకు దరఖాస్తులను చేసుకోవాలని బీసీసీఐ సూచించింది.అయితే వేల సంఖ్యలో హెడ్ కోచ్ పదవికీ దరఖాస్తులు వచ్చి చేరాయి. జరిగిన ఐపీఎల్ సిరీస్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆరంభం నుంచి పటిష్టంగా ఉన్న కోల్‌కతా చివరి వరకు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో రాణించడంతో ఆ జట్టు ట్రోఫీని సాధించింది.
కోల్‌కతా జట్టు అన్ని రంగాల్లో రాణించడానికి ఆ జట్టు కన్సల్టెంట్‌గా ఉన్న గౌతమ్ గంభీర్ కారణమని కోల్‌కతా జట్టు ఆటగాళ్లు, నిర్వాహకులు పదే పదే చెబుతున్నారు.ఈ సందర్భంలో, భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్‌ను నియమించడంపై బీసీసీఐ కమిటీలో చాలా మంది గంభీర్ కు మద్దతు తెలిపారు. మాజీ లు, ప్రస్తుత ఆటగాళ్లు కూడా అతని పేరును సూచించినట్లు సమాచారం. దీంతో తదుపరి కోచ్ గా గంభీర్ అవుతాడని దాదాపు ఖారారైనట్టు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే భారత క్రికెట్ బోర్డు ప్రకటన చేయనుందని సమాచారం.
Advertisment