తాను మరణిస్తూ మరో ఆరుగురికి ప్రాణం పోసిన యువకుడు!

తాను మరణిస్తూ మరో 6 గురికి అవయవదానం చేసిన గుంటూరు జిల్లా మంగళగిరి వ్యక్తి.మంగళగిరికి చెందిన న్యాయవాది మునగపాటి ప్రసాద్‌ ఈ నెల 2వతేదీన తెనాలి రోడ్డు పై రోడ్డు ప్రమాదానికి గురైయాడు.దీంతో ఆయనని స్థానిక NRI ఆసుపత్రిలో చేరిపించగా..కొద్ది రోజులకి ఆయన బ్రెయిన్ డెడ్ అయ్యారు.

New Update
తాను మరణిస్తూ మరో ఆరుగురికి ప్రాణం పోసిన యువకుడు!
 మంగళగిరి అన్నపూర్ణ డీలక్స్‌ సెంటరుకు చెందిన న్యాయవాది మునగపాటి ప్రసాద్‌ (40) ఈ నెల రెండవ తేదీన తెనాలి రోడ్డులో పెదవడ్లపూడి నుంచి మంగళగిరి వైపు ద్విచక్ర వాహనంపై వస్తుండగా రోడ్డు దాటుతున్న వ్యక్తిని తప్పించబోయి ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన ప్రసాద్‌ను హుటాహుటిన చినకాకాని ఎన్నారై ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స అందించి బతికించే ప్రయత్నం చేశారు. అయితే, గురువారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ప్రసాద్‌ మెదడు పనిచేయడం స్తంభించింది. దీంతో బ్రెయిన డెడ్‌గా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
కుటుంబ సభ్యులు దుఖఃసాగరంలో మునిగిపోయారు. అంతటి దుఖఃంలోనూ అవయవదానం చేసి మరికొందరికి ప్రాణదానం చేయాలనే ఆలోచన కుటుంబ సభ్యుల్లో మెదిలింది. భార్య సంధ్యారాణి అనుమతితో అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని వైద్యులకు తెలియజేయగా, వైద్య బృందం ఎన్నారై అడ్మినిసే్ట్రటర్‌ మండవ విష్ణువర్ధనరావు దృష్టికి తీసువెళ్లారు. దీంతో ఎన్నారై వైద్యులు, జీవనదాన ట్రస్టు ప్రతినిధులు శుక్రవారం అవయవదానానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఎన్నారై మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు, ఆర్గాన డొనేషన విభాగాధిపతి డాక్టర్‌ మస్తాన సాహెబ్‌ పర్యవేక్షణలో వైద్య బృందం ప్రసాద్‌ శరీరం నుంచి గుండె, లివర్‌, కిడ్నీలు, ఊపిరితిత్తులు, నేత్రాలను సేకరించారు.
గుండెను తిరుపతిలోని పద్మావతి ఆసుపత్రికి, ఒక కిడ్నీని ఎన్నారై ఆసుపత్రిలోని రోగికి, మరో కిడ్నీని ఆయుష్‌ ఆసుపత్రికి, ఊపిరితిత్తులను హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రికి, కాలేయాన్ని తాడేపల్లి మణిపాల్‌ ఆసుపత్రికి, నేత్రాలను పెదకాకాని శంకర నేత్రాలయానికి తరలించారు. తొలుత మధ్యాహ్నం 2:46 గంటలకు గుండెను సేకరించి ఎన్నారై సిబ్బంది అశ్రునీరాజనాల మధ్య అంబులెన్సలోకి ఎక్కించి గ్రీన కారిడార్‌ ద్వారా గన్నవరం విమానాశ్రయానికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతి తరలించారు. ఆ తరువాత మిగతా అవయవాలను ఒక్కొక్కటిగా సేకరించారు. ఈ అవయవాలను ఆరు నుంచి ఏడుగురికి అమర్చవచ్చని వైద్యులు తెలిపారు.
ప్రసాద్‌ భౌతికకాయాన్ని శనివారం ఉదయం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆ వెంటనే కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.తాను మరణిస్తూ మరో 6గురికి ప్రాణదానం చేసిన ప్రసాద్‌ త్యాగాన్ని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.
Advertisment
తాజా కథనాలు