Vijayawada: డెడ్ బాడీ గాలింపులో షాకింగ్ ట్విస్ట్.. వరుసగా కొట్టుకొస్తున్న శవాలు

ఒక మృతదేహం కోసం వెతికితే మూడు మృతదేహాలు కనపడిన ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. ఓ కేసు మిస్టరీని ఛేదించేలోపు మరో సవాల్ ఎదురైంది. బందర్ కాలువలో వరుసగా మృతదేహాలు కొట్టుకొస్తుండడంతో లంక గ్రామాల ప్రజలు హడలిపోతున్నారు. ఇన్ని శవాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియక బెంబేలెత్తిపోతున్నారు.

Vijayawada: డెడ్ బాడీ గాలింపులో షాకింగ్ ట్విస్ట్.. వరుసగా కొట్టుకొస్తున్న శవాలు
New Update

publive-image

రత్నభాస్కర్ మృతదేహం లభ్యం..

కృష్ణా నదిని అనుకునే విజయవాడ పరిసర ప్రాంతాలు ఉండటంతో అక్కడ కాలువలు ఎక్కువగా ఉంటాయి. వాటిని అనుకుని నివసించే ప్రాంతాలను లంక గ్రామాలు అంటుంటారు. అయితే తాజాగా బందర్ కాలువ పొడవున ఒకేరోజు మూడు మృతదేహాలు కొట్టుకురావడం స్థానికలును భయభ్రాంతులకు గురిచేసింది. సోమవారం అవనిగడ్డకు చెందిన రత్నభాస్కర్ అనే వ్యక్తి కాలువలో పడిపోయినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో కాలువలో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు తోటవల్లూరు మండలం కలవారిపాలెం వద్ద భాస్కర్ మృతదేహం దొరికింది. డెడ్ బాడీని చూసిన కుటుంబసభ్యులు అది రత్నభాస్కర్‌దేనని గుర్తించారు. ఎవరో హత్యచేసి కెనాల్‌లో పడేసినట్లుగా అనుమానిస్తున్నారు.

వరుసగా కొట్టుకొస్తున్న మృతదేహాలు..

ఇంతవరకు బాగానే ఉన్న గాలింపు చేపడుతున్న పోలీసులకు వరుస మృతదేహాలు కనబడటం షాక్‌కు గురిచేసింది. అన్ని మృతదేహాలు ఎక్కడి నుంచి వచ్చాయో.. అవి ఎవరివో తెలుసుకోలేక సతమతమవుతున్నారు. కాలువలో కొట్టుకొచ్చిన డెడ్‌బాడీలు మొత్తం గుర్తుపట్టలేనంతగా మారి దుర్గంధం వెదజల్లుతూ కుళ్లిన స్థితిలో ఉన్నాయి. దీంతో వాటిని కనిపెట్టడం పోలీసులకు సవాల్‌గా మారింది. విజయవాడ నుంచి కొన్ని కిలోమీటర్ల పొడవున ఉండే ఈ కాలువలో మృత దేహాలు ఎక్కడి నుంచి వచ్చాయి.. హత్య చేశారా లేదా ఆత్మహత్య చేసుకున్నారా అనేది ప్రశ్నార్థకంగా మారాయి. ఈ మిస్టరీని చేధించే పనిలో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఎక్కువ వాసన వస్తుండటంతో వాటిని బయటకు తీయలేక ఇబ్బందులు ఎదురువుతున్నట్లు పేర్కొంటున్నారు.

భయాందోళన చెందుతున్న స్థానికులు..

మరోవైపు లంక గ్రామాల ప్రజలు మాత్రం ఇటీవల వరుసగా మృతదేహాలు కాలువలో కొట్టుకొస్తున్నట్లు తెలిపారు. విజయవాడ శివారు ప్రాంతాల నుంచి అవనిగడ్డ వరకు రోజూ ఏదో ఒక మృతదేహం కనిపిస్తుందంటున్నారు. ఎగువ నుంచి నీళ్లు దిగువకు వదిలిన ప్రతిసారి ఇలాంటివి తరుచూ చూస్తున్నామని చెబుతున్నారు. వాటిని చూసి భయాందోళనకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe