/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/dc-vs-MI-jpg.webp)
MI vs DC IPL 2024: ఐపీఎల్ 2024లో హార్ధిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ (49), ఇషాన్ కిషన్ (42), టిమ్ డేవిడ్ (45*) రొమారియో షెపర్డ్ అజేయంగా 39 పరుగులు చేయడంతో ముంబై ఇండియన్స్ వారి నిర్ణీత 20 ఓవర్లలో 234 పరుగులు చేసింది. 235 పరుగుల లక్ష్యాన్ని సాధించడంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫెయిల్ అయ్యింది. అయితే ముంబై బ్యాటింగ్‌కు, ఢిల్లీ ఛేజింగ్‌కు మధ్యలో భారీ తప్పిదం చేసింది వాంఖడే మ్యానేజ్‌మెంట్. దీనిపై ఢిల్లీ క్యాపిటల్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
అసలేం జరిగిదంటే?
ఢిల్లీ క్యాపిటల్స్ 235 పరుగుల తేడాతో గెలుపొందినట్లు స్క్రీన్ పై చూపించి.. తప్పులో కాలేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ లోపాన్ని సరిచేసుకున్న వాంఖడే స్టాఫ్.. ఆ డిస్‌ప్లేను వెంటనే మార్చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి 235 పరుగులు కావాలంటూ డిస్‌ప్లే చేశారు. ఇలాంటి తప్పిదాలు నిజానికి అప్పుడప్పుడు జరుగుతుంటాయి.
Dilli, time to counter this late surge, with the bat ✊🏼#YehHaiNayiDilli#IPL2024#MIvDCpic.twitter.com/ooLLRpCVRD
— Delhi Capitals (@DelhiCapitals) April 7, 2024
Shocking If True🤯🤯
📸: BCCI / Jio Cinema#DCvsMI#indianprimerleague#TATAIPL#CRICKET#IPL#IPL2024#INDIANCRICKET#IPL20#BCCIpic.twitter.com/IFpPXLvmK4
— SportsTiger (@The_SportsTiger) April 7, 2024
ఇది కూడా చదవండి: హమ్మయ్య..మొత్తానికి జేపీ నడ్డా భార్య కారు దొరికింది..అసలేం జరిగిందంటే!