Ranchi: విడాకులు తీసుకున్న కూతురికి ఘనంగా స్వాగతం తెలిపిన తండ్రి.. వీడియో వైరల్..

కూతురికి పెళ్లి చేసి ఘనంగా అత్త వారింటికి పంపిస్తారు తల్లిదండ్రులు. బ్యాండ్‌ బాజాలతో ధూంధాంగా బారాత్‌లు చేస్తుంటారు. కానీ జార్ఘండ్‌లో ఓ కూతురి విడాకుల ఊరేగింపును ఎంతో ఘనంగా నిర్వహించాడు ఓ తండ్రి. అత్తింట్లో కూతురు పడుతున్న కష్టాలు చూడలేక..భారీ ఊరేగింపుతో ఘనంగా పుట్టింటికి తీసుకొచ్చాడు. విడాకులను కూడా పెళ్లి మాదిరిగా జరిపించి వార్తల్లో నిలిచాడు.

New Update
Ranchi: విడాకులు తీసుకున్న కూతురికి ఘనంగా స్వాగతం తెలిపిన తండ్రి.. వీడియో వైరల్..

Ranchi: కూతురికి పెళ్లి చేసి ఘనంగా అత్త వారింటికి పంపిస్తారు తల్లిదండ్రులు. బ్యాండ్‌ బాజాలతో ధూంధాంగా బారాత్‌లు చేస్తుంటారు. కానీ జార్ఘండ్‌లో ఓ కూతురి విడాకుల ఊరేగింపును ఎంతో ఘనంగా నిర్వహించాడు ఓ తండ్రి. అత్తింట్లో కూతురు పడుతున్న కష్టాలు చూడలేక..భారీ ఊరేగింపుతో ఘనంగా పుట్టింటికి తీసుకొచ్చాడు. విడాకులను కూడా పెళ్లి మాదిరిగా జరిపించి వార్తల్లో నిలిచాడు.

రాంచీకి చెందిన ప్రేమ్‌ గుప్తా..తన కూతురు సాక్షి గుప్తాకు గతేడాది ఏప్రిల్‌లో సచిన్‌ కుమార్ అనే వ్యక్తితో ఘనంగా వివాహం జరిపించారు. కానీ అది మూణ్ణాళ్ల ముచ్చటే అయింది. పెళ్లైన కొద్ది రోజులకే అతని నిజస్వరూపం బయటపడింది. అత్తారింట్లో కూతురికి వేధింపులు మొదలయ్యాయి. అంతేకాదు. అతనికి గతంలోనే పెళ్లి జరిగిందని తెలిసింది. ఐనా తన కూతురు అతనితో కలిసి బతకాలనుకుందని..కానీ వేధింపులు ఎక్కువయ్యేసరికి వివాహ బంధానికి ముగింపు పలకాలనే నిర్ణయానికొచ్చినట్టు తెలిపారు తల్లిదండ్రులు.

ఇదికూడా చదవండి: మనిషి కాదు రాక్షసి.. ఏడుస్తోందని చిన్నారిని చిదిమేసింది.. ఎక్కడ జరిగిందంటే..

విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన అనంతరం..కూతుర్ని భారీ ఊరేగింపుతో పుట్టింటికి తీసుకొచ్చారు. టపాసులు కాలుస్తూ ఓ పండగలా సెలబ్రేట్‌ చేసుకున్నారు. అత్తింటి వేధింపుల నుంచి విముక్తి లభించిందనే సంతోషంతో తన కూతురికి ఘనంగా స్వాగతం పలికారు. ఆడపిల్లలు ఎంతో విలువైనవారని, అత్తింట్లో వారికి కష్టాలు ఎదురైతే గౌరవంతో పుట్టింటికి తీసుకురావాలంటున్నారు ప్రేమ్‌ గుప్తా.

పెళ్లైన ఏడాదికే కూతురు విడాకులు తీసుకుంటే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. బిడ్డ జీవితం ఏమవుతుందోనని తల్లడిల్లిపోతారు. ఎలాగోలా సర్దుకుపోమ్మా అని కూతురికి నచ్చచెప్పేందుకు ప్రయత్నిస్తారు. కానీ ప్రేమ్‌గుప్తా మాత్రం కష్టాల కాపురం వద్దని..తన కూతుర్ని ఘనంగా పుట్టింటికి తీసుకురావడం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

ఇదికూడా చదవండి: Gold Rates Today: అతివలకు అదిరిపోయే న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. ఇవాళ ఎంతంటే..

Advertisment
Advertisment
తాజా కథనాలు