Sravan vs Revanth: రేవంత్‌రెడ్డి పచ్చ కామెర్లోడు..కనకపు సింహాసనంపై శునకం..దాసోజు శ్రవణ్ ఫైర్‌!

ఆర్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై మండిపడ్డారు బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్. రైతులకు కరెంట్ వద్దు కానీ.. రేవంత్‌రెడ్డికి మాత్రం 24గంటలు కరెంట్ కావాలా అని ప్రశ్నిచారు. పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని..కనకపు సింహాసనంపై శునకం అంటే ఇదేనంటూ ఫైర్ అయ్యారు.

New Update
Sravan vs Revanth: రేవంత్‌రెడ్డి పచ్చ కామెర్లోడు..కనకపు సింహాసనంపై శునకం..దాసోజు శ్రవణ్ ఫైర్‌!

రైతులకు ఉచిత కరెంట్‌పై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఓవైపు సొంతపార్టీ నేతలు.. మరోవైపు అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ లీడర్లు రేవంత్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. రేవంత్ వ్యాఖ్యలపై మాజీ కాంగ్రెస్‌ లీడర్‌, ప్రస్తుత బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఆర్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో విరుచుకుపడ్డారు. అసలు రేవంత్‌కి ఏం తెలుసంటూ విమర్శలు గుప్పించారు. రైతులకు 3గంటలు లేదా 8గంటలు ఉచిత కరెంట్ సరిపోతుందని రేవంత్‌రెడ్డికి ఎలా తెలుసని..ఓసారి ఆయన పుట్టి, పెరిగిన చోట కానీ..ఇతర గ్రామాల్లో కానీ రైతులను అడిగి చూడలన్నారు శ్రవణ్‌. రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డికి చేసింది తప్పా..? ఉచిత్ కరెంట్‌ ఇచ్చిన కాంగ్రెస్‌ సీఎంలు వాళ్లే కదా అంటూ గతాన్ని గుర్తు చేశారు శ్రవణ్‌. రేవంత్‌ ఒక స్టుపిడ్‌ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు శ్రవణ్‌.

తెలుగుదేశం భాష:
ప్రస్తుతం టీపీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి ఒకప్పుడు టీడీపీలో కీలక నేత. చంద్రబాబుకు రేవంత్‌ రైట్‌ హ్యాండ్‌ అని చెబుతుంటారు. ఓటుకు నోటు కేసు తర్వాత మారిన సమీకరణలతో పాటు టీడీపీకి తెలంగాణలో కేడర్‌ తగ్గిపోవడంతో రేవంత్‌ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారంటారు విశ్లేషకులు. అయితే ఇప్పటికీ చంద్రబాబు మాటలనే రేవంత్‌ మాట్లాడుతున్నారని దాసోజు శ్రవణ్‌ ఆరోపిస్తున్నారు. నాడు వ్యవసాయం దండగ అని చంద్రబాబు చెప్పారని.. ఇప్పుడు రైతలకు ఉచిత విద్యుత్ ఎందుకని రేవంత్‌ ప్రశ్నిస్తున్నారంటూ ఆర్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కామెంట్స్ చేశారు శ్రవణ్‌. కరెంట్ అడిగిన రైతులను కాల్చి చంపిన చంద్రబాబు భాషను రేవంత్‌ ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఇప్పుడు రేవంత్ ఉన్నది తెలుగుదేశంలో కాదు కదా అని క్వశ్చన్‌ చేశారు శ్రవణ్‌. చంద్రాబాబు ఆలోచన..రేవంత్ ఆచరణలోకి ఎందుకు మారిందని మండిపడ్డారు. రేవంత్‌ లీడర్‌షిప్‌లో కాంగ్రెస్‌ ఇలానే కొనసాగితే రైతు బంధు, రైతు భీమా ఇలా అన్నిటిని రద్దు చేస్తుందని చురకలంటించారు శ్రవణ్‌.

మోదీ భాష మాట్లాడుతున్నారు:
ఉచితాలు అనుచితాలు అన్నది మోదీ నినాదమని.. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి ప్రధాని భాషని ఎందుకు మాట్లాడుతున్నారని ఎద్దెవా చేశారు శ్రవణ్‌. ఓవైపు రాహుల్‌ గాంధీ ఉచితాలు కావాలంటారని.. మరోవైపు రేవంత్‌ ఏమో ఉచితాలు దండగా అంటున్నాడని.. ఇదేంటో అర్థంకావడంలేదన్నారు శ్రవణ్‌. నోటికి ఏది వస్తే అది మాట్లాడతారా అని ప్రశ్నించారు. అసలు రేవంత్‌రెడ్డి ఎవరివైపో చెప్పాలని ప్రశ్నిచారు..రాహుల్‌వైపా..మోదీవైపే..అసలు రేవంత్‌ ఎవరివైపంటూ చురకలంటిచారు. రైతులకు కరెంట్‌ వద్దు అన్న మాట అప్పర్‌ క్లాస్‌ హెజిమని కామెంట్ అంటూ ఆరోపించారు శ్రవణ్‌. రైతులకు కరెంట్ వద్దు కానీ..ఆయనకు మాత్రం 24గంటలూ పవన్‌ కావాలని..కరెంట్‌ లేకపోతే జనరేటర్‌ కావాలని.. దేశానికి సంపద సృష్టిస్తున్న అన్నదాతకు మాత్రం ఇవేవి అవసరం లేదా అని నిలదీశారు శ్రవణ్‌.

రేవంత్‌ ఏమన్నారంటే..?
‘‘తెలంగాణలో 95 శాతం మంది రైతులు 3 ఎకరాల లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులే. ఎకరాకు నీళ్లు పారించాలంటే ఒక గంట విద్యుత్‌ చాలు. 3 ఎకరాల్లో వ్యవసాయం చేసే రైతుకు 3 గంటల విద్యుత్‌ చాలు. మొత్తంగా 8 గంటల ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుంది. కేవలం విద్యుత్ సంస్థల కమీషన్లకు కక్కుర్తి పడి వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అనే నినాదం తీసుకొచ్చారు. ఉచిత కరెంట్ పేరుతో సీఎం కేసీఆర్ ప్రజలను మభ్య పెడుతున్నారు. ఇలాంటి ఉచితం అనేది అనుచితంగా వ్యవహరించొద్దు. దాన్ని మన స్వార్థానికి వాడుకోవద్దని చెప్పి ఉచిత కరెంట్ విషయంలో స్పష్టంగా చెబుతున్నాం’’ అంటూ అమెరికాలో ఉన్న రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేయడంతో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీకి మంచి అస్త్రం దొరికినట్టు అయ్యింది. రేవంత్‌ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ నేతలతో పాటు సొంతపార్టీ నేతలు కూడా తప్పుపడుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు