Telangana Weather: తెలంగాణలో ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. ఈ ఎండలు ఐదు రోజులు మరింత డేంజర్ ఉంటాయని వాతావరణశాఖ అధికారులు తెలుపుతున్నారు. ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరుతాయని వార్నింగ్ ఇస్తున్నారు. వారంపాటు తీవ్ర వడగాలులు ఉన్నాయన్నారు. కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, యాదాద్రి, వరంగల్, వనపర్తి జగిత్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్‌ను జారీ చేశారు. మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు, ఆదిలాబాద్, భద్రాచలం, రామగుండం, ఖమ్మంలో 42 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు చెబుతున్నారు. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలంటున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని అధికారులు హెచ్చరిక జారీ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: సూర్యాపేటలో విషాదం.. ప్రేమ పెళ్లి నిరాకరించారని ప్రేమ జంట ఆత్మహత్య