Also Read: ఒక్కో పోస్టుకు 715 మంది పోటీ.. గ్రూప్-1 కు రికార్డు సంఖ్యలో అప్లికేషన్లు!
సికింద్రాబాద్ ఎంపీ టికెట్ దానం నాగేందర్ కు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చేవెళ్ల సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం చేవెళ్ల ఎంపీ టికెట్ ఆఫర్ చేసిందని ప్రచారం జరుగుతోంది. చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ పేరును మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేయడంతో రంజిత్ రెడ్డి అసహనం వ్యక్తం చేస్తూ పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ ను వీడటంతో హైదరాబాద్ లో ఆ పార్టీకి పెద్ద నష్టమేనని రాజకీయ నేతలు అంటున్నారు. కాంగ్రెస్ లో మరికొందరు కీలక నేతలు చేరుతారనే టాక్ కూడా వినిపిస్తోంది.
వరుసగా ఎదురుదెబ్బలు..
ఇదిలా ఉండగా.. తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి సొంత నేతలే షాక్ ఇస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందడంతో రానున్న లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన మాజీ సీఎం కేసీఆర్ కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే కూతురు, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవ్వడంతో ఆ పార్టీలో ప్రకంపనులు మొదలైయ్యాయి. తాజాగా ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీని వీడడంతో పార్టీకి పెద్ద దెబ్బేనని రాజకీయ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.