దమ్ముంటే.. దళితబంధు,బీసీబంధు పై శ్వేత పత్రం విడుదల చేయాలి!

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీలకు ఆర్థిక సహాయం చేయని ప్రభుత్వం తెలంగాణలోనే ఉందన్నారు. దళితులకు భూమి ఇస్తానన్న కేసీఆర్ మాట తప్పారని ఆయన ధ్వజమెత్తారు.

New Update

Dammante.. white paper should be released on Dalit Bandhu and BC Bandhu!

ఇలా మాటలు చెప్పి మభ్య పెట్టడంలో కేసీఆర్ ని మించిన వారు లేరని జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. దళితబంధు అందరికి ఇస్తా అన్న కేసీఆర్ అందులో కూడా కోత పెట్టారని ఆయన విమర్శించారు. ఈ బడ్జెట్లో 17700 కోట్లు దళిత బంధు కోసం కేటాయించారని కాని ఇప్పటి వరకు కనీసం నిబంధనలు కూడా తయారు చేయలేదన్నారు.

రెండేళ్లుగా బడ్జెట్ లోనిధులు కేటాయించినా.. విడుదలను వాయిదా వేసి సీఎం మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నిరుద్యోగ బీసీ యువత ఒక్కడికి కూడా సహాయం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీబంధు ఇస్తా అన్నారు.. ఇప్పుడేమో కొన్ని కులాల వారికే లక్ష సాయం చేస్తామంటున్నారని జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక కొత్తగా మైనార్టీ బంధు అని కొత్త జీవో తెచ్చారని అన్నారు.

ఇప్పటి వరకు దళితబంధు, బీసీ బంధు ఎంత మందికి ఇచ్చారో శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక మోడీ, కేసీఆర్ ఇద్దరు అల్లుకొని తిరిగినప్పుడు ఎందుకు కాళేశ్వరంకి జాతీయ హోదా తీసుకొని రాలేకపోయారని జీవన్ రెడ్డి నిలదీశారు.

Advertisment
తాజా కథనాలు