అదృష్టం అంటే ఇదే భయ్యా.. ఒక పూటలోనే లక్షాధికారి అయ్యాడు

మారుమూలన ఉన్న ఓ గ్రామం జనాలతో కిటకిటలాడుతోంది. గంపెడు ఆశలతో ఎక్కడెక్కడ నుంచో ప్రజలు ఆ ఊరు వస్తున్నారు. తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఇంతకీ ఆ ఊరు ఎక్కడుంది? వందలాదిగా జనం ఎందుకు అక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు తెలుసుకుందాం.

New Update
అదృష్టం అంటే ఇదే భయ్యా.. ఒక పూటలోనే లక్షాధికారి అయ్యాడు

ఎన్టీఆర్ జిల్లా నందిగామ చందర్లపాడు మండలం గుడిమెట్లలో ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. సత్తెనపల్లి దగ్గర బిగుబండ గ్రామానికి చెందిన కుటుంబం గుడిమెట్లలో వజ్రాల వేట కొనసాగిస్తుండగా.. ఓ వజ్రం దొరికింది. వజ్రానికి 6 కోణాలు(షడ్ బుజి వజ్రం) ఉండటంతో మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో వజ్రాల వ్యాపారులు సుమారు రూ.50-60 లక్షలు పలికే ఆ వజ్రాన్ని రూ.40లక్షలకు కొంటామని బేరాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నో ఏళ్లుగా గుడిమెట్లలో వజ్రాల వేట సాగుతోంది. గుడిమెట్లను గతంలో రాజులు పరిపాలించంతో ఇక్కడ వజ్రాలు దొరకుతాయని వందలాది మంది వజ్రాల కోసం వెతుకులాట చేస్తున్నారు. ఇటీవల కాలంలో గుడిమెట్లకు జనాల తాకిడి విపరీతంగా పెరిగింది. రాత్రుళ్ల సమయంలో గుడిమెట్లలో నిద్రలు చేసి మరీ వజ్రాల వేట చేస్తున్నారు. మొన్న ఒక్కరోజే మూడు వజ్రాలు దొరికాయని తెలియడంతో భోజనాలు తెచ్చుకుని మరీ వేట కొనసాగిస్తున్నారు.

రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ప్రతి ఏడాది వజ్రాల వేట భారీగానే సాగుతుంది. తొలకరి వర్షాలు ప్రారంభం కాగానే.. చాలా మంది ప్రజలు పొలాల వెంబడి తిరుగుతూ వజ్రాల వేట సాగిస్తారు. ఈ క్రమంలోనే ఇటీవల కర్నూలు జిల్లాకు చెందిన ఓ రైతు పంట పండింది. పొలం పనులు చేస్తుండగా వజ్రం దొరికింది. జిల్లాలోని మద్దెకర మండలం బసినేపల్లి గ్రామంలో ఓ రైతుకు అత్యంత విలువైన వజ్రం దొరికింది. దానిని అమ్మకానికి పెట్టగా కొనడానికి వ్యాపారులు పోటీపడ్డారు. గతంలో కూడా కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం పగిడిరాయి, బొల్లవానిపల్లె పొలాల్లో ఇద్దరికి రెండు వజ్రాలు దొరికాయి. ఇక అనంతపురంలోనూ అనేక మంది రైతులకు వజ్రాలు లభించాయి. అంతకుముందు చిన్న జొన్నగిరికి చెందిన ఓ రైతుకు ఏకంగా కోటి 20 లక్షల రూపాయల విలువైన వజ్రం లభించిందని తెలుస్తోంది.

సాధారణంగా వర్షాకాలం ప్రారంభంలో వజ్రాలు దొరుకుతూనే ఉంటాయి. దొరికిన వజ్రాన్ని స్థానికంగా ఉన్న వ్యాపారులు అక్కడే కొనేస్తుంటారు. వజ్రం బరువు ఎంత ఉందో.. ఎన్ని క్యారెట్లు ఉందో.. వజ్రం ఎలాంటి క్వాలిటీ లాంటి విషయాలు చెప్పకుండానే తక్కువ ధరకు స్థానికుల నుంచి కొని క్యాష్ చేసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా రాయలసీమ జిల్లాలలో వజ్రాల నిక్షేపాల కోసం అన్వేషణ చేసింది. ఈ క్రమంలోనే రాయలసీమలో బంగారు నిక్షేపాలు ఉన్నట్లుగా గుర్తించింది. 2013లో బంగారం నిక్షేపాల వెలికితీతకు జియో మైసూర్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.

Advertisment
Advertisment
తాజా కథనాలు