Earn money: రోజూ 2 గంటలే ఉద్యోగం చేస్తూ.. లక్షలు సంపాదిస్తున్న యువతి! 9 టు 5 జాబ్ అందరూ చేస్తారు. ఆ యువతి.. తన కెరీర్ భిన్నంగా ఉండాలి అనుకుంది. అందుకో తెలివైన ప్లాన్ వేసింది. 5 నెలలు కష్టపడింది. ఇప్పుడు లక్షలు సంపాదిస్తోంది. ఎలాగో తెలుసుకుందాం. By Durga Rao 19 Apr 2024 in బిజినెస్ లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి ప్రతి రోజూ రెండు గంటలు మాత్రమే ఉద్యోగం చేసి, లక్షల రూపాయలు సంపాదిస్తూ.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది ఎం వాల్కోట్ అనే యువతి. కేవలం 5 నెలలు ఉద్యోగం చేసి..ఆమె లక్షలు సంపాదించింది. మనీ కోసం రోజూ 2 గంటలు మాత్రమే పనిచేస్తోంది. ఆ తర్వాత రోజంతా ఖాళీగానే ఉంటోంది. అయినా లక్షలు సంపాదిస్తోంది. తాను ఏం చేస్తున్నదీ ఆమె టిక్ టాక్‌లో వివరాలు తెలిసింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వాల్కోట్ అఫిలియేట్ మార్కెట్ నచ్చింది. ఇది ఎలాంటిదంటే.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి సైట్లు అమ్మే ప్రొడక్టుల లింకులను ఇంటర్నెట్లో షేర్ చేస్తారు. ఎవరైనా ఆ లింకులు క్లిక్ చేసి.. వస్తువులు కొంటే.. అందులో కొంత కమిషన్.. లింకులు పోస్ట్ చేసిన వారికి దక్కుతుంది. ఇలా ఈ అఫిలియేట్ మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఇండియాలో వారు వేసిన లింక్‌ని అమెరికాలో కస్టమర్ క్లిక్ చేసి, వస్తువు కొంటే.. ఇండియాలో లింక్ వేసిన వారికి కమిషన్ వస్తుంది. అంటే.. రూపాయి పెట్టుబడి లేకుండా.. సంపాదించే మార్గం ఇది. ఇలాంటిది చేపట్టేవారు.. ఆయా వెబ్సైట్లలో ఉచితంగా అఫిలియేషన్ అకౌంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అకౌంట్లో లాగిన్ అయ్యాక.. అక్కడ లింకులు ఉంటాయి. వాటిని ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు వెబ్సైట్లలో పోస్ట్ చేస్తుంటారు. అఫిలియేషన్ లింక్స్ ద్వారా వచ్చే కమిషన్ తక్కువగానే ఉంటుంది. కానీ.. ఎక్కువ లింకులు పోస్ట్ చెయ్యడం ద్వారా.. ఎక్కువ మంది వస్తువులు కొనడం ద్వారా మంచి రాబడి వస్తుంది. ఈ యువతి కూడా అదే చేసింది. దాదాపు 5 నెలలపాటూ… ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైట్లలో లింకులు పోస్ట్ చేసింది. దాంతో.. ఎక్కడ చూసినా ఆమె లింకులే. ఫలితంగా ఇప్పుడు ఆమెకు రోజూ వేల కొద్దీ మనీ వస్తోంది. ఇలా నెల నెలా లక్షలు సంపాదిస్తోంది. ఈ కారణంగానే ఇప్పుడు ఆమె రోజూ 2 గంటలే పనిచేస్తోంది. ఇలా లింకులు పెరిగే కొద్దీ, నానాటికీ ఆమె సంపాదన పెరుగుతోంది. మీరు కూడా ఇలాంటిది చెయ్యాలనుకుంటే ప్రయత్నించవచ్చు. అయితే.. ఇదేమంత తేలిక కాదు. ఇండియాలో ఇప్పటికే చాలా మంది అఫిలియేషన్ మార్కెట్లో తమ ముద్ర వేసుకున్నారు. వారు వేసిన లింక్స్ ఇప్పుడు చాలా సైట్లలో ఉన్నాయి. అందువల్ల కొత్తగా ఈ మార్కెట్లోకి ప్రవేశించేవారు.. తమ ముద్ర వెయ్యడానికి చాలా టైమ్ పట్టే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. #money #earn-money-online #earn-money మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి