Rana Daggubati : 'బాహుబలి' మేకర్స్ తో దగ్గుబాటి రానా హారర్ మూవీ.. డైరెక్టర్ ఎవరంటే?

దగ్గుబాటి రానా నెక్ట్స్‌ హారర్ థ్రిల్లర్ ప్రాజెక్టులో నటించబోతున్నాడట. కిశోర్ అనే డెబ్యూ డైరెక్టర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. నవంబర్ నుంచి చిత్రీకరణ షురూ కానుంది. 'బాహుబలి' లాంటి బ్లాక్ బస్టర్‌ను తెరకెక్కించిన ఆర్కా మీడియా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

New Update
Rana Daggubati : 'బాహుబలి' మేకర్స్ తో దగ్గుబాటి రానా హారర్ మూవీ.. డైరెక్టర్ ఎవరంటే?

Daggubati Rana : బాహుబలి' తో పాన్ ఇండియా లెవెల్ లో నటుడిగా భారీ గుర్తింపు తెచ్చుకున్న దగ్గుబాటి రానా గత కొంత కాలంగా సినిమాల విషయంలో కాస్త వెనకబడ్డాడు. కెరీర్ స్టార్టింగ్ లో బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేసిన ఈ హీరో ప్రస్తుతం సినిమా సినిమాకు మధ్య బాగా గ్యాప్ తీసుకుంటున్నాడు. ఇటీవల కాలంలో చూసుకుంటే ఈ హీరో నుంచి సినిమా వంచి రెండేళ్లవుతుంది. చివరగా రానా 2022 లో 'విరాట పర్వం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఇదిలా ఉంటే ఈ హీరో ఇప్పుడు బాహుబలి మేకర్స్ తో చేతులు కలపనున్నట్టు తాజా సమాచారం బయటికొచ్చింది. రానా కొత్త సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటివరకు యాక్షన్, కమర్షియల్ పాత్రలతో ప్రేక్షకులను అలరించిన రానా, తన నటనలో మరో కోణాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నారు.

Also Read : ‘బిగ్ బాస్’ 8 లోకి బుల్లితెర హాట్ బ్యూటీ.. ఆమె ఎవరంటే?

రానా నెక్ట్స్‌ హారర్ థ్రిల్లర్ ప్రాజెక్టులో నటించబోతున్నాడట. కిశోర్ అనే డెబ్యూ డైరెక్టర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు సమాచార. ప్రెజెంట్ ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో ఉండగా.. నవంబర్ నుంచి చిత్రీకరణ షురూ కానుంది. అర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

'బాహుబలి' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యానర్, ఇప్పుడు రానాతో కలిసి మరో విజయం సాధించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ హారర్ థ్రిల్లర్ సినిమాలో రానా ఎలాంటి పాత్ర పోషించనున్నారనే విషయంపై ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ నెలకొంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు