Rana Daggubati : సినిమాలకు గ్యాప్ అందుకే వచ్చింది.. దగ్గుబాటి రానా ఆసక్తికర వ్యాఖ్యలు! దగ్గుబాటి రానా తాజాగా తన సినీ కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దాదాపు రెండేళ్ల నుంచి వెండితెరపై కనిపించకపోవడం గురించి ఐఫా ఉత్సవ్ ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు.' కొత్తగా ఏదైనా చేద్దామని కొంతకాలంగా వెతుకుతున్నా. అలా సుమారు రెండేళ్లు గడిచిపోయింది' అని అన్నారు. By Anil Kumar 17 Jul 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Daggubati Rana About His Movie Career In IIFA Utsav : 'బాహుబలి' తో పాన్ ఇండియా లెవెల్ లో నటుడిగా భారీ గుర్తింపు తెచ్చుకున్న దగ్గుబాటి రానా గత కొంత కాలంగా సినిమాల విషయంలో కాస్త వెనకబడ్డాడు. కెరీర్ స్టార్టింగ్ లో బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేసిన ఈ హీరో ప్రస్తుతం సినిమా సినిమాకు మధ్య బాగా గ్యాప్ తీసుకుంటున్నాడు. ఇటీవల కాలంలో చూసుకుంటే ఈ హీరో నుంచి సినిమా వంచి రెండేళ్లవుతుంది. చివరగా రానా 2022 లో 'విరాట పర్వం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మళ్లీ ఆయన నుంచి ఇప్పటిదాకా మరో సినిమా రానేలేదు. మధ్యలో 'రానా నాయుడు' అనే వెబ్ సిరీస్ తో ఓటీటీలో సందడి చేశాడు. అలాగే నిఖిల్ 'స్పై' మూవీలో క్యామియోతో ఆకట్టుకున్నాడు. అయితే రానా తాజాగా తన సినీ కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దాదాపు రెండేళ్ల నుంచి వెండితెరపై కనిపించకపోవడం గురించి ఐఫా ఉత్సవ్ ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. Also Read : ప్రభాస్ కు అది కామన్.. కానీ నాకు అలా కాదు : అమితాబ్ బచ్చన్ "నా జీవితం అంతా కొత్త సినిమాలు చేస్తూ వచ్చాను. ఇప్పుడు ఆ సినిమాలు మామూలు అయిపోయాయి. అందరూ చేస్తున్నారు. కొత్తగా ఏదైనా చేద్దామని కొంతకాలంగా వెతుకుతున్నా. అలా సుమారు రెండేళ్లు గడిచిపోయింది. త్వరలోనే కొత్త సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంటా" అని అన్నాడు. దీంతో రానా చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. #daggubati-rana #daggubati-rana-at-iifa-utsav మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి