AP BJP: టీడీపీ బంద్‌కు మద్దతుపై సైబర్ క్రైమ్ పోలీసులకు పురందేశ్వరి ఫిర్యాదు

టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా బంద్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ పిలుపు ఇచ్చిన బంద్‌కు రాష్ట్రంలోని విపక్షాలు జనసేన, సీపీఐ, లోక్‌సత్తా, జై భీమ్ పార్టీలు మద్దతు ఇచ్చాయి. అయితే బీజేపీ కూడా బంద్‌కు మద్దతు ఇచ్చిందని ఆ పార్టీ చీఫ్ పురందేశ్వరి సంతకంతో కూడిన ఓ లెటర్‌ హెడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై పురందేశ్వరి కూడా స్పందించారు.

AP BJP: టీడీపీ బంద్‌కు మద్దతుపై సైబర్ క్రైమ్ పోలీసులకు పురందేశ్వరి ఫిర్యాదు
New Update

AP BJP: టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా బంద్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ పిలుపు ఇచ్చిన బంద్‌కు రాష్ట్రంలోని విపక్షాలు జనసేన, సీపీఐ, లోక్‌సత్తా, జై భీమ్ పార్టీలు మద్దతు ఇచ్చాయి. అయితే బీజేపీ కూడా బంద్‌కు మద్దతు ఇచ్చిందని ఆ పార్టీ చీఫ్ పురందేశ్వరి సంతకంతో కూడిన ఓ లెటర్‌ హెడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై పురందేశ్వరి కూడా స్పందించారు. "తెలుగుదేశం పార్టీ ఇచ్చిన బంద్ పిలుపునకు మద్దతు ఇచ్చినట్లుగా బీజేపీ లెటర్ హెడ్‌పై నేను మద్దతు పలికినట్లు ఒక ఫేక్ లెటర్ వాట్సాప్ గ్రూపులలో సర్క్యులేట్ అవుతోంది .ఈ ఫేక్ లెటర్ సర్క్యులేట్‌కు కారకులపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తాము" అని ట్వీట్ చేశారు. ఈ మేరకు బీజేపీ ఆంధ్రప్రదేశ్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలిపారు.

చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు ఆయన అరెస్టును ఖండిస్తూ పురందేశ్వరి ట్వీట్ చేశారు. బాబు అరెస్ట్ అప్రజాస్వామికం అని వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కానీ టీడీపీ ఇచ్చిన బంద్‌కు మాత్రం బీజేపీ మద్దతు చెప్పకపోవడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు ఏపీ వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. తెల్లవారుజామున నుంచే టీడీపీ శ్రేణులు బయటకు వచ్చి తమ నిరసన పాటిస్తున్నారు. మరోవైపు పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ సత్యవేడు నియోజకవర్గంలో రోడ్డుపై టైర్లు కాల్చి నిరసన వ్యక్తం చేశారు. బంద్ నేపథ్యంలో బస్సులు డిపోలకే పరిమతమయ్యాయి. ముందస్తు చర్యల్లో భాగంగా టీడీపీ కీలక నేతలను పోలీసులు హౌస్ అరెస్టులు చేస్తున్నారు. అటు పాఠశాలలకు యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి.

తెలుగుదేశం పార్టీ తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు జనసేన పార్టీ సంఘీభావం ప్రకటించింది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా జరిగిన చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో వ్యవస్థలను నిర్వీర్యం చేసి ప్రజా కంటక చర్యలకు పాలక పక్షం ఒడిగడుతోందంటూ తీవ్ర విమర్శలు చేశారు పవన్. ప్రజాపక్షం వహిస్తూ మాట్లాడే ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష సాధింపుతో కేసులు, అరెస్టులతో వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ అప్రజాస్వామిక చర్యలను జనసేన ఎప్పుడూ సహించదని బంద్‌లో జనసేన శ్రేణులు శాంతియుతంగా పాల్గొనాలని కోరారు.

టీడీపీ పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్‌కు సీపీఐ కూడా సంఘీభావం ప్రకటించింది. బంద్ నేపథ్యంలో ఇవాళ జరగాల్సిన రౌండ్‌టేబుల్ సమావేశాన్ని వాయిదా వేసినట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. బంద్‌లో పార్టీ శ్రేణులు శాంతియుతంగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. అలాగే లోక్‌సత్తా పార్టీ, జై భీమ్ పార్టీలు బంద్‌కు మద్దతు తెలిపాయి.

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు పోలీసులు. 144 సెక్షన్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎవరైనా ఆందోళనలు, సంబరాలు చేసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి