Daggubati Abhiram Wedding: శ్రీలంకలో ఘనంగా.. దగ్గుబాటి అభిరామ్ డెస్టినేషన్ వెడ్డింగ్..!

నిర్మాత సురేష్ దగ్గుబాటి చిన్న కుమారుడు అభిరామ్ పెళ్లి వేడుకలు శ్రీలంకలోని ఓ రిసార్ట్ లో ఘనంగా జరిగాయి. అభిరామ్ తనకు మరదలు వరుసయ్యే ప్రత్యుష చాపరాలను వివాహం చేసుకున్నారు. డిసెంబర్ 6న ఈ జంట మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు.

New Update
Daggubati Abhiram Wedding: శ్రీలంకలో  ఘనంగా.. దగ్గుబాటి అభిరామ్ డెస్టినేషన్ వెడ్డింగ్..!

Daggubati Abhiram Wedding: దగ్గుబాటి కుటుంబంలో పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. టాలీవుడ్ నిర్మాత దగ్గుబాటి సురేష్ చిన్న కుమారుడు అభిరామ్ వివాహం బుధవారం రాత్రి శ్రీలంకలో గ్రాండ్ గా జరిగింది. శ్రీలంకలో నిర్వహించిన డెస్టినేషన్ వెడ్డింగ్ కు ఫ్యామిలీ మెంబర్స్, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అభిరామ్ తన చిన్న తాత మనవరాలు ప్రత్యుష చాపరాలను వివాహం చేసుకున్నారు. ఆమె వరుసకు మరదలు అవుతుంది. శ్రీలంకలో సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ జంట మూడు బంధంతో ఒకటయ్యారు. పెళ్లి వేడుకల్లో సురేష్ బాబు, అభిరామ్, మాళవిక, రానా, మిహీక దంపతులు, నాగ చైతన్య, వెంకటేష్ చేస్తూ కనిపించారు.

publive-image

Also Read:OTT Release: మూవీ లవర్స్‌ని కిక్కెక్కించే సినిమాలు.. ఓటీటీలో కొత్త రిలీజ్‌లు ఇవే!

శ్రీలంకలో పెళ్లి వేడుకలు పూర్తయిన తర్వాత.. హైదరాబాద్ తిరిగి రానున్నారు. త్వరలోనే హైదరాబాద్ లో సినీ ప్రముఖులు, ఇండస్ట్రీ సన్నిహితుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం వీరి పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అభిరామ్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో హీరోగా 'అహింస' తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.

publive-image

Also Read: Daggubati Abhiram’s wedding: శ్రీలంకలో ఘనంగా దగ్గుబాటి అభిరామ్ పెళ్లి సంబరాలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

#AA22xA6: వామ్మో.! ఒక్క హీరో కోసం ముగ్గురు స్టార్ హీరోయిన్లు.. అట్లీ ప్రాజెక్ట్ పై పెరుగుతున్న అంచనాలు

అల్లు అర్జున్ - అట్లీ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరలవుతోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె కూడా ఈ ప్రాజెక్ట్ లో బాగమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే జాన్వీ, మృణాల్ ఇద్దరు హీరోయిన్లు ఇందులో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

New Update

#AA22xA6:  అల్లు అర్జున్ - అట్లీ కాంబోలో రాబోతున్న సినిమాపై  పై రోజురోజుకు అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ మరింత క్యూరియాసిటీని పెంచేలా ఉంది. ఇప్పటికే ఈమూవీలో అల్లు అర్జున్ జోడీగా మృణాల్, జాన్వీ ఇద్దరు హీరోయిన్లు కనిపించబోతున్నట్లు నెట్టింట ప్రచారం జోరుగా జరుగుతోంది. కాగా, ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ ఈ ప్రాజెక్ట్ లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. 

ముగ్గురు హీరోయిన్లు 

 తాజా సమాచారం ప్రకారం.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె కూడా అల్లు అర్జున్- అట్లీ సినిమాలో కీలక పాత్ర పోషించేందుకు ఒకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో అల్లు అర్జున్ మూడు డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నారట. దీంతో ముగ్గురు హీరోయిన్లు బన్నీ  జోడీగా మెరవనున్నట్లు సమాచారం.  అల్లు అర్జున్, దీపికా, అట్లీ పవర్ ఫుల్ కాంబో కలిసి రావడం ఫ్యాన్స్ లో మరింత ఆసక్తిని పెంచుతోంది. అంతేకాదు ఈ సినిమా కోసం దీపికా ప్రభాస్ 'స్పిరిట్' నుంచి తప్పుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్. 

ఇదిలా ఉంటే ఇటీవలే  ముంబై బాంద్రాలోని మోహబూబా స్థూడియోస్ లో అల్లు అర్జున్ లుక్ టెస్ట్, కాన్సెప్ట్ ఫొటో షూట్ జరిగాయి.  బన్నీ పాత్ర కోసం డైరెక్టర్ అట్లీ డిఫరెంట్ లుక్స్ అన్వేషించారట. రగ్గడ్ నుంచి స్టైలిష్ వరకు ఇలా చాలా ట్రై చేశారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ ని ఓ భిన్నమైన ఇమేజ్ తో పరిచయం చేయాలని అనుకుంటున్నారట అట్లీ.

telugu-news | cinema-news | latest-news | Allu Arjun – Atlee Allu Arjun – Atlee 

Also Read: Iswarya Menon: నడుము అందాలు చూపిస్తున్న ఐశ్వర్య.. హాట్ లుక్స్‌లో పిచ్చెక్కిస్తుందిగా!

Advertisment
Advertisment
Advertisment