Rana Daggubati: రహస్యంగా రానా తమ్ముడి వివాహం..అమ్మాయి ఎవరంటే!

నిర్మాత దగ్గుబాటి సురేష్‌ చిన్న కుమారుడు అభిరామ్‌ వివాహం డిసెంబర్‌ 4న శ్రీలంక లో జరుగుతుందని సమాచారం. ఈ వివాహం గురించి ఇప్పటి వరకు దగ్గుబాటి ఫ్యామిలీ బయట ఎక్కడ కూడా చెప్పలేదు.

New Update
Rana Daggubati: రహస్యంగా రానా తమ్ముడి వివాహం..అమ్మాయి ఎవరంటే!

ఈ సంవత్సరం తెలుగు ఇండస్ట్రీకి చెందిన హీరోలందరూ ఓ ఇంటి వారవుతున్నారు. ఇప్పటికే మెగా కంపౌడ్ నుంచి మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ నటి లావణ్య త్రిపాఠితో ఏడడగులు వేశాడు. ఇప్పుడు ఈ లిస్ట్‌ లోకి మరో కుర్ర హీరో చేరుతున్నాడు. అతను మరెవరో కాదు దగ్గుబాటి వారసుడు దగ్గుబాటి అభిరామ్‌.

అభిరామ్‌ నిర్మాత దగ్గుబాటి సురేష్‌ చిన్న కుమారుడు. రానా కి తమ్ముడు. ఈ ఏడాది దర్శకుడు తేజ దర్శకత్వంలో వచ్చిన అహింస చిత్రం ద్వారా టాలీవుడ్ కి పరిచయమయ్యాడు. కానీ ఆ చిత్రం అనుకున్న విజయం సాధించకపోవడంతో పెద్దగా పేరు రాలేదు. అభిరామ్‌ కి హీరోగా నిలబడాలి అంటే చాలా సమయం పడుతుందనే చెప్పవచ్చు.

ఇదిలా ఉంటే గత కొంత కాలం నుంచి అభిరామ్‌ పెళ్లి వార్తలు సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి. తాజాగా వస్తున్న వార్తల ప్రకారం...అభిరామ్‌కి ఓ వ్యాపార వేత్త కుమార్తె అయినటువంటి ప్రత్యూష చపరా తో డిసెంబర్‌ 4న శ్రీలంకలో వివాహం జరుగుతుందని తెలుస్తుంది.

శ్రీలంకలోని ఫైవ్‌ స్టార్‌ రిసార్ట్‌ అనంతర కలుతారాలో వీరి పెళ్లి చాలా గ్రాండ్‌ గా జరగనుందని సమచారం. అయితే ఇప్పటి వరకు అభిరామ్ పెళ్లి గురించి దగ్గుబాటి ఫ్యామిలీ బయటపెట్టలేదు. ఎక్కడ సమాచారం కూడా తెలపలేదు. కాగా ఇప్పటికే దగ్గుబాటి ఫ్యామిలీ మొత్తం కూడా లంకకు బయల్దేరినట్లు సమాచారం.

ఈ వివాహం 5 రోజుల పాటు జరుగుతుందని సమాచారం. అయితే ఈ పెళ్లికి ముఖ్య అతిథులుగా కేవలం 200 మంది మాత్రమే హాజరుకానున్నట్లు సమాచారం. పెళ్లి అయిన తరువాత హైదరాబాద్‌ కి తిరిగి వచ్చి గ్రాండ్‌ గా రిసెప్షన్‌ ఏర్పాటు చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ పెళ్లి ఇంత సీక్రెట్ గా చేయడం వెనుక కారణం ఏంటి అంది తెలియాల్సి ఉంది.

Also read: మా విజయం అమరవీరులకు అంకితం:రేవంత్ రెడ్డి !

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు