/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/electricity-employees.jpg)
Electricity Employees: విద్యుత్ ఉద్యోగులు, ఆర్థిజన్లు, పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్ల కరువు భత్యం 3.004 శాతం పెరిగింది. వారి డీఏ ను 8.776 శాతం నుంచి 11. 78శాతానికి పెంచుతూ తెలంగాణ ట్రాన్స్కో సంస్థ సీఎండీ ఎస్ఏం రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. పెరిగిన డీఏ జనవరి 1, 2024 నుంచి అమల్లోకి రానున్నట్లు పేర్కొన్నారు. 2023 జూలై-డిసెంబర్ (గతంలో పెంచారు), 2024 జనవరి-మే మధ్య కాలానికి పెరిగిన డీఏ బకాయిలను ఉద్యోగులు, ఆర్జిజన్లు, పెన్షనర్లకు 11 సమాన వాయిదాల్లో చెల్లించనున్నట్టు చెప్పారు. సంప్రదాయం ప్రకారం ట్రాన్స్కో ఉత్తర్వులను అనుసరిస్తూ.. జెన్కో, టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్సీ డీసీఎల్ సంస్థలు సైతం తమ ఉద్యోగులు, పెన్షనర్ల డీఏను ఈ మేరకు పెంచుతూ త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం.