Miss World 2024 Winner : 27 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత భారత్ మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇచ్చింది. ఈ కార్యక్రమంలో మిస్ వరల్డ్ 2024 విజేతను ప్రకటించారు. ఎన్నో అంచనాల మధ్య పోటీలో నిలిచిన భారత్ కు ఈసారి నిరాశే ఎదురైంది. భారత్ తరపున కన్నడ భామ సినీ శెట్టి ప్రాతినిధ్యం వహించారు. ఆమె టాప్ 8కే పరిమితమయ్యారు. ఈ ఏడాది ఈ కిరీటాన్ని చెక్ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిస్కోవా కైవసం చేసుకుంది . మాజీ ప్రపంచ సుందరి మేగాన్ యంగ్ కొత్త ప్రపంచ సుందరి కిరీటం ద్వారా ఏళ్ల నాటి సంప్రదాయాన్ని అనుసరించారు.
ఈ పోటీలో, లెబనాన్‌కు చెందిన యాస్మినా జైటౌన్ 71వ మిస్ వరల్డ్‌లో మొదటి రన్నరప్‌గా నిలిచింది. ఈ పోటీలో టాప్ 4 ఫైనలిస్ట్‌లలో లెబనాన్, ట్రినిడాడ్, టొబాగో, బోట్స్వానా , చెక్ రిపబ్లిక్ ఉన్నాయి.భారత పోటీదారు సిని శెట్టి టాప్ 8 వరకు ప్రతి రౌండ్‌ను సులభంగా పాస్ చేస్తూనే ఉంది.
కానీ ఆతిథ్య దేశానికి చెందిన పోటీదారులు టాప్ 4 రేసులో ఎలిమినేట్ అయ్యారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన నీతా అంబానీ, మిస్ వరల్డ్ హ్యుమానిటేరియన్ అవార్డును అందుకున్నారు. 71వ మిస్ వరల్డ్ పోటీని మాజీ ప్రపంచ సుందరి మేగాన్ యంగ్, కరణ్ జోహార్ నిర్వహించారు. షాన్, నేహా కక్కర్ టోనీ కక్కర్ వంటి ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: కాశీలో హర్ హర్ మహాదేవ్ నినాదంతో ప్రధాని మోదీకి ఘన స్వాగతం.!