Cyclone : సైక్లోన్ ఎఫెక్ట్.. పలు రైళ్లు, విమానాలు అప్పటి వరకు రద్దు.!

బంగాళాఖాతంలో ఏర్పడిన పీడనం వాయుగుండంగా మారింది. ఈ తుఫాను కారణంగా కోల్‌కతా విమానాశ్రయంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుండి సోమవారం ఉదయం 9 వరకు విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. దీంతో పాటు తూర్పు రైల్వే, సౌత్ ఈస్టర్న్ రైల్వేలకు చెందిన పలు రైళ్లు కూడా రద్దు అయ్యాయి.

New Update
Cyclone : సైక్లోన్ ఎఫెక్ట్.. పలు రైళ్లు, విమానాలు అప్పటి వరకు రద్దు.!

Cyclone Effect: బంగాళాఖాతంలో ఏర్పడిన పీడనం వాయుగుండంగా మారిన సంగతి తెలిసిందే. తుఫాను రెమాల్ ప్రస్తుతం ద్వీపానికి 350 కి. మీ దూరంలో ఉంది. అయితే, రమాల్ తుఫాను కారణంగా కోల్‌కతా విమానాశ్రయంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సోమవారం ఉదయం 9 వరకు విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. దీంతో పాటు తూర్పు రైల్వే, సౌత్ ఈస్టర్న్ రైల్వేలకు చెందిన డజన్ల కొద్దీ రైళ్లు కూడా రద్దు చేయబడ్డాయి.

Also Read: హైదరాబాద్‌లో భారీ వర్షం.. రాష్ట్రంలో ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్..!

రెమాల్ తుఫాను దృష్ట్యా మే 26న ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, తూర్పు మిడ్నాపూర్, కోల్‌కతా, హౌరా, హుగ్లీలలో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. నదియా, పశ్చిమ మేదినీపూర్, తూర్పు బుర్ద్వాన్‌ ప్రాంతాల్లో కూడా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.

Also Read: రెమాల్‌ తుపాన్ ఎఫెక్ట్.. ఏపీకి బిగ్ అలర్ట్‌..!

రమాల్ తుపాను కారణంగా కోల్‌కతా విమానాశ్రయాన్ని 21 గంటల పాటు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆదివారం మ. 12 గంటల నుంచి సోమవారం ఉదయం 9 వరకు ఎలాంటి విమాన సర్వీసులు ఉండవు. దీంతో దాదాపు 50 వేల మంది విమాన ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. తుపాను సమయంలో ఎలాంటి నష్టం జరగకుండా విమానాశ్రయ అధికారులు ఈ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు.  ముందుజాగ్రత్త చర్యగా అన్ని దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేశారు.

Advertisment
తాజా కథనాలు