Cyberabad Traffic Police : మీ పిల్లలు స్కూల్ కి వెళ్లి సేఫ్ గా రావాలంటే.. సైబరాబాద్ పోలీసుల 15 టిప్స్!

సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ అధికారులు ఓ వీడియోను రిలీజ్ చేశారు. పిల్లలు రోడ్డు ప్రమాదం బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. స్కూల్ బస్సు లేదా ఆటోలో పరిమితికి మించి పిల్లలను ఎక్కించకూడదని.. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారిని డ్రైవర్ గా నియమించుకోకూడదని తెలిపారు.

New Update
Cyberabad Traffic Police : మీ పిల్లలు స్కూల్ కి వెళ్లి సేఫ్ గా రావాలంటే.. సైబరాబాద్ పోలీసుల 15 టిప్స్!

Cyberabad Traffic Police: ఈ మధ్య కాలంలో పిల్లలు స్కూల్‌కి వెళ్లే టైంలో ప్రమాదాల బారిన పడుతున్నారు. వాహన డ్రైవర్లు, స్కూల్ యాజమాన్యం, తల్లిదండ్రుల పొరపాట్ల కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు ట్రాఫిక్ అధికారులు. ఇలా యాక్సిడెంట్లు జరగకుండా ఎప్పటికప్పుడు పోలీస్‌శాఖ తగిన సూచనలు చెబుతుంటుంది. అయినా కొంతమంది నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తుండడం బాధాకరం. ఇక ఇదే సమయంలో సోషల్‌మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ అధికారిక ట్విట్టర్‌ హ్యాండిల్‌ నుంచి ఈ వీడియో రిలీజ్ అయ్యింది. పిల్లల కోసం తల్లిదండ్రులు, డ్రైవర్లు, స్కూల్‌ యాజమాన్యం తీసుకోవాల్సిన చర్యలను ఆ వీడియోలో వివరించారు.

ప్రమాదాలు జరగకుండా ఏం చేయాలంటే?

--> స్కూల్ బస్సు లేదా ఆటోలో పరిమితికి మించి పిల్లలను ఎక్కించకూడదు.

--> చాలా మంది బస్సు దిగిన వెంటనే మళ్లీ అదే బస్‌ ఎదురు నుంచి రోడ్‌ క్రాస్‌ చేస్తారు. ఇలా చేయవద్దు.

--> బస్సుల కిటికిల్లో నుంచి చేతులు బయటపెట్టడం కాని, బ్యాగులు బయటపెట్టడం కాని చేయకూడదు.

--> డ్రంక్ డ్రైవింగ్, సిగ్నిల్ జంప్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ లాంటి అత్యంత ప్రమాదాకరమైన ఉల్లంఘనులు చేసిన వారిని నియమించుకోకూడదు.

--> అనుభవం ఉన్న డ్రైవర్ నే నియమించుకోవాలి.

--> డ్రైవింగ్ చేసినప్పుడు అతడి ప్రవర్తన ఎలా ఉందో యాజమాన్యం, తల్లిదండ్రులు గమనించాలి.. సంబంధిత డ్రైవర్‌ ప్రవర్తన గురించి పిల్లలని అడిగి తెలుసుకోవాలి.

--> తల్లిదండ్రులు పిల్లలను బైక్ పై స్కూల్ కు తీసుకొని వెళ్లే అప్పుడు పిల్లలకు కూడా హెల్మెంట్ మస్ట్.

--> ఎట్టి పరిస్థితిలోనూ ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించకూడదు.

--> ఓవర్‌ స్పీడ్ గా వెళ్లకూడదు.

--> బ్యాగులు, టిఫిన్ బాక్స్ లు బైక్‌ హ్యాండిల్ కు తగిలించకూడదు.

--> యాజమాన్యం పాఠశాల ముందు సెక్యూరిటీని ఉంచి పిల్లలను సురక్షితంగా లోపలికి వెళ్లేలా చూసుకోవాలి.

--> పిల్లలకు స్కూల్లో రోడ్డు భద్రతాపై అవగాహన కల్పించాలి.

--> స్కూల్ బస్సులు కండీషన్ లో ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి.

--> క్రమం తప్పకుండా స్కూల్‌ బస్సులను మెయింటెయిన్ చేయాలి.

--> పిల్లల భవిష్యత్ నిర్ణయించే పాఠశాల లోనే పిల్లలకు రోడ్డు భద్రతపై అవగాహన పెంచాలి.. వారి బంగారు భవిష్యత్ కు బాటలు వేయాలి.

Also Read:నడిరోడ్డుపై ప్రజాపాలన దరఖాస్తులు.. రేవంత్ సర్కార్ సీరియస్.. ఆ అధికారులపై వేటు!

Advertisment
తాజా కథనాలు