Hyd Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై సెల్ఫీలు, కేక్ కటింగ్ తో పాటు అవన్నీ బ్యాన్.. పోలీసుల కొత్త రూల్స్, ఫైన్ల వివరాలివే!

హైదరాబాద్ లోని కేబుల్ బ్రిడ్జిపై వాహనాలను ఆపి సెల్ఫీలు దిగినా.. బర్త్ డే కేక్ కటింగ్ లను నిర్వహించినా రూ.1000 ఫైన్ విధిస్తామని పోలీసులు హెచ్చరించారు. సందర్శకులు తమ వాహనాన్ని ఐటీసీ కోహినూర్ వద్ద ఆపి బ్రిడ్జి పైకి నడకమార్గంలో రావాలన్నారు.

New Update
Hyd Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై సెల్ఫీలు, కేక్ కటింగ్ తో పాటు అవన్నీ బ్యాన్.. పోలీసుల కొత్త రూల్స్, ఫైన్ల వివరాలివే!

ఇటీవల హైదరాబాద్ లోని కేబుల్ బ్రిడ్జిపై (Hyderabad Cable Bridge) ఫొటోలు దిగుతున్న ఇద్దరిని కారు ఢీకొట్టడంతో వారు మరణించిన విషయం తెలిసిందే. అంతకు ముందు సైతం కేబుల్ బ్రిడ్జిపై అనేక యాక్సిడెంట్లు జరిగాయి. ఈ నేపథ్యంలో కేబుల్‌బ్రిడ్జిపై ప్రమాదాల నివారణకు పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రమాదాల నివారణకు వాహనదారులు, పర్యాటకులకు అవగాహన కల్పించడం కోసం మాదాపూర్ సీఐ గడ్డం మల్లేష్ ఆధ్వర్యంలో సోమవారం కేబుల్ బ్రిడ్జి నడక మార్గంలో కవాతు నిర్వహించారు.
ఇది కూడా చదవండి: Hyderabad: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. మెట్రో బంపర్ ఆఫర్..!

ఈ సందర్భంగా గడ్డం మల్లేష్ మాట్లాడుతూ.. ఫొటోల కోసం బ్రిడ్జిపై వాహనాలు నిలిపితే రూ.1000 జరిమానా విధించనునున్నట్లు ప్రకటించారు. కేబుల్ బ్రిడ్జిపై వాహనాలు నిలిపి ఫొటోలు దిగడం కారణంగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. కేబుల్ బ్రిడ్జిపై వాహనాలు ఆపడం నిషేధమన్నారు.

ఇంకా ఐటీసీ కోహినూర్ వద్ద వాహనలు ఆపి.. నడక మార్గంలో వచ్చి కేబుల్ బ్రిడ్జ్ ను చూడొచ్చన్నారు. ఈ ప్రాంతంలో బర్త్ డే వేడుకలు, కేక్ కట్ చేయడం కూడా నిషేధించినట్లు తెలిపారు. ఈ రూల్స్ ను పాటించకపోతే కఠిన చర్యలు ఉంటామని హెచ్చరించారు సీఐ మల్లేష్.

Advertisment
తాజా కథనాలు