Cyber Crime: సైబర్ నేరగాళ్లపై కేంద్రం ఉక్కుపాదం.. ఏకంగా 20 లక్షల సిమ్ కార్డుల బంద్!

దేశవ్యాప్తంగా సైబర్ నేరాలను అంటే ఆన్‌లైన్ మోసాలను అరికట్టడానికి ప్రభుత్వం అతి పెద్ద చర్యకు రెడీ అయింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడుతున్న దాదాపు 20 లక్షల సిమ్ లను రీ వెరిఫై చేసి ఒకేసారి డిస్ కనెక్ట్ చేయడానికి సిద్ధం అవుతున్నట్టు అధికారులు తెలిపారు.

Cyber Crime: సైబర్ నేరగాళ్లపై కేంద్రం ఉక్కుపాదం.. ఏకంగా 20 లక్షల సిమ్ కార్డుల బంద్!
New Update

Cyber Crime: ఆన్‌లైన్ మోసాలను అరికట్టడానికి ప్రభుత్వం చేపట్టిన మొదటి దేశవ్యాప్త ఆపరేషన్‌లో భాగంగా టెలికాం ఆపరేటర్లు రికార్డు స్థాయిలో 1.8 మిలియన్ లేదా అంతకంటే ఎక్కువ మొబైల్ కనెక్షన్‌లను ఒకేసారి డిస్‌కనెక్ట్ చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 

Cyber Crime: సైబర్ క్రైమ్‌లో ప్రమేయం ఉండడంతో  దేశవ్యాప్తంగా 28,000 మొబైల్ హ్యాండ్‌సెట్‌లను బ్లాక్ చేయాలని టెలికాం ఆపరేటర్లను డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) ఆదేశించింది. ఈ హ్యాండ్‌సెట్‌లతో అనుసంధానించిన 20 లక్షల మొబైల్ కనెక్షన్‌ల రీవెరిఫికేషన్‌ను నిర్వహించాలని కూడా డిపార్ట్‌మెంట్ టెల్కోలను కోరింది. “సైబర్ నేరాలు - ఆర్థిక మోసాలలో టెలికాం వనరుల దుర్వినియోగాన్ని అరికట్టడానికి DoT, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA), రాష్ట్ర పోలీసులు చేతులు కలిపారు. ఈ సహకార ప్రయత్నం మోసగాళ్ల నెట్‌వర్క్‌లను విచ్ఛిన్నం చేయడం - డిజిటల్ బెదిరింపుల నుండి పౌరులను రక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది” అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Cyber Crime: దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్ల వల్ల నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్‌సిఆర్‌పి) ప్రకారం 2023 సంవత్సరంలో డిజిటల్ ఆర్థిక మోసం కారణంగా దేశ ప్రజలు రూ.10,139 కోట్లు నష్టపోయారు. ఫైనాన్స్‌పై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదిక ప్రకారం, 2023 సంవత్సరంలో డిజిటల్ మోసాలకు సంబంధించి 6,94,000 కంటే ఎక్కువ ఫిర్యాదులు అందాయి. దీంతో ఇప్పుడు ప్రభుత్వం సైబర్ క్రైమ్స్ ను టార్గెట్ చేసింది. ఆన్‌లైన్ మోసాలను అరికట్టాలని ధేయంతో ముందుకు కదులుతోంది. అందులో భాగంగా మొదటి దేశవ్యాప్త ఆపరేషన్ మొదలు పెట్టింది. ఇందులో భాగంగా దాదాపు 20 లక్షల పైగా మొబైల్ కనెక్షన్స్ ను రీ వెరిఫికేషన్ చేస్తున్నారు అధికారులు. వీటిలో ఎక్కువ భాగం కనెక్షన్లను ఒకేసారి డిస్‌కనెక్ట్ చేసే అవకాశం ఉంది. 

Also Read: ఇరాన్ అధ్యక్షుడే కాదు మన వైఎస్ తో సహా చాలామంది..

Cyber Crime: సైబర్ క్రైమ్‌లలో 28,200 మొబైల్ హ్యాండ్‌సెట్‌లు దుర్వినియోగమైనట్లు MHA - రాష్ట్ర పోలీసులు జరిపిన విశ్లేషణలో వెల్లడైంది. దీనిని DoT మరింత విశ్లేషించి, ఈ మొబైల్ హ్యాండ్‌సెట్‌లలో 20 లక్షల నంబర్‌లను ఉపయోగించినట్లు కనుగొంది. తరువాత,  28,200 మొబైల్ హ్యాండ్‌సెట్‌లను దేశవ్యాప్తంగా  బ్లాక్ చేయడానికి అలాగే,  ఈ మొబైల్ హ్యాండ్‌సెట్‌లకు లింక్ చేసిన 20 లక్షల మొబైల్ కనెక్షన్‌లను వెంటనే రీవెరిఫికేషన్ చేయాలని అంతేకాకుండా,  విఫలమైన రీ-వెరిఫికేషన్‌ను డిస్‌కనెక్ట్ చేయాలని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు DoT ఆదేశాలు జారీ చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. 

Cyber Crime: ఈ ఆదేశాల మేరకు ఇప్పటికే టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు తమ పని ప్రారంభించారు. మొబైల్ ఫోన్ కనెక్షన్ల రీ వెరిఫికేషన్ మొదలు పెట్టారు. జూన్ మొదటి వారం తరువాత తప్పుడు పద్ధతుల్లో ఉపయోగిస్తున్న మొబైల్ కనెక్షన్లను ఒకేసారి డిస్ కనెక్ట్ చేసే అవకాశం ఉంది. 

Cyber Crime: సైబర్ క్రైమ్- ఆర్థిక మోసాలలో టెలికాం వనరుల దుర్వినియోగాన్ని అరికట్టడానికి ప్రభుత్వం, బ్యాంకులు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల వంటి ఆర్థిక సంస్థలతో సహా వివిధ వాటాదారుల మధ్య సమన్వయం కోసం మార్చిలో, కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి అశ్విని వైష్ణవ్ డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫారమ్ (డిఐపి)ని విడుదల చేశారు. ప్లాట్‌ఫారమ్‌లో టెలికాం వనరుల దుర్వినియోగంగా గుర్తించిన కేసులకు సంబంధించిన సమాచారం కూడా ఉంది. ఇది అధీకృత వాటాదారుల నుంచి మాత్రమే దొరుకుతుంది. 

#telecom #cyber-crime
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe