Cyber bullying: పోలీసులను ఆశ్రయించిన మాజీ సీఎం కూతురు.. కారణం తెలుసా?

కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ కుమార్తె అచ్చు ఊమెన్ పోలీసులను ఆశ్రయించారు. సోషల్‌మీడియాలో తనపై విషం చిమ్మే కార్యక్రమం జరుగుతుందని కంప్లైంట్ ఇచ్చారు. అచ్చు కంప్లైంట్ తర్వాత సదరు వ్యక్తి ఆమెకు క్షమాపణలు చెప్పాడు. గత నెలలో ఊమెన్ చాందీ మరణంతో పుతుపల్లిలో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో చాందీ కుటుంబంపై సోషల్‌మీడియాలో పలువురు అసత్యాలను పోస్ట్ చేస్తున్నారని సమాచారం.

New Update
Cyber bullying: పోలీసులను ఆశ్రయించిన మాజీ సీఎం కూతురు.. కారణం తెలుసా?

Cyber bullying against Oommen Chandy daughter: సైబర్ బెదిరింపులపై కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ కుమార్తె అచ్చు ఊమెన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఒక రోజు తర్వాత, మాజీ రాష్ట్ర సెక్రటేరియట్ అధికారి ఆమెను వేధించినందుకు క్షమాపణలు చెప్పారు. గతంలో అచ్చు ఊమెన్‌పై చేసిన వ్యాఖ్యలకు వామపక్ష సంస్థ మాజీ నాయకుడు నందకుమార్ కోలతప్పిల్లి బేషరతుగా క్షమాపణలు చెప్పారు. “నా నుంచి వచ్చిన సమాధానం ఊమెన్ చాందీ కుమార్తెను అవమానించినట్లుగా మారింది. స్త్రీ గౌరవాన్ని కించపరిచే ఉద్దేశ్యం నాకు లేదు. నేను పోస్ట్‌ను తొలగించాను, ఈ విషయంలో బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాను” అని అతను ఫేస్‌బుక్‌లో రాశాడు.


అసలేం జరిగింది:
ఆగస్టు 28న పూజపురా పోలీసులకు, రాష్ట్ర మహిళా కమిషన్‌కు అచ్చు ఫిర్యాదు చేశారు. తిరువనంతపురంకు చెందిన ఓ వ్యక్తి తన ఫేస్‌బుక్ ఖాతాలో తన పరువుకు నష్టం కలిగించే విధంగా పోస్ట్ చేశాడంటూ కంప్లైంట్‌ చేశారు. దీనికి సదరు వ్యక్తి ఇప్పటికే సారీ చెప్పారు. ఇక తన కుటుంబంతో UAEలో నివసిస్తున్న అచ్చు.. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బుల్లియింగ్‌కి గురవుతున్నారు . దివంగత కాంగ్రెస్ కురువృద్ధుడు ఊమెన్ చాందీ ఆయన కుమారుడు చాందీ ఊమెన్ నిరాడంబర జీవితం గడిపేవారని.. అచ్చు మాత్రం ఖరీదైన జీవనశైలిని అలవాటు చేసుకున్నారని ఆరోపణలు ఉన్నారు. విలాసవంతమైన వాచ్‌లు, బట్టలు ధరించి ఉన్న వీడియోలు సోషల్‌మీడియాలో చాలా ఉన్నాయి. ఆమె ఫ్యాషన్, ట్రావెల్‌, లైఫ్‌స్టైల్‌పై దృష్టి సారించే కంటెంట్ క్రియేటర్‌. సోషల్ మీడియా పేజీలోని కంటెంట్ ఆమె ఉద్యోగంలో భాగమని అచ్చు క్లారిటీ ఇచ్చారు.


పుత్తుపల్లి ఉపఎన్నిక సమీపిస్తున్న తరుణంలో ఆమెపై ప్రచారం జరగడంతో అచ్చు కూడా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆమె సోదరుడు చాందీ ఊమెన్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా, సీపీఐ(ఎం) 2016, 2021 ఎన్నికల్లో ఊమెన్‌ చాందీ చేతిలో ఓడిపోయిన జైక్‌ సీ.థామస్‌తో తలపడనున్నారు. ఈ ఏడాది జులై 18న సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఊమెన్‌ చాందీ మృతి చెందడంతో సెప్టెంబర్‌ 5న ఉప ఎన్నిక జరగనుంది. ఉప ఎన్నిక జరగనున్న పుత్తుపల్లిలో ప్రచారం జోరందుకోవడంతో అభ్యర్థుల వ్యక్తిగత జీవితం, వారి సమీప బంధువులు, ఆస్తులపై కొన్ని ఆన్‌లైన్ మీడియా వర్గాలు విష ప్రచారం చేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.

ALSO READ: బరువు తగ్గాలంటే ఈ యోగాసనాలు వేయాల్సిందే..!!

Advertisment
తాజా కథనాలు