CUET (UG) Results: సీయూఈటీ (యూజీ) ఫలితాలు విడుదల.. లింక్ ఇదే!

కామన్‌ యూనివర్సిటీస్‌ ఎంట్రన్స్ టెస్ట్‌-2024 (యూజీ) ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ విడుదల చేసింది. అభ్యర్థులు స్కోర్‌ కార్డును అధికారిక వెబ్‌సైట్ exams.nta.ac.in/CUET నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది.

CUET (UG) Results: సీయూఈటీ (యూజీ) ఫలితాలు విడుదల.. లింక్ ఇదే!
New Update

CUET: కామన్‌ యూనివర్సిటీస్‌ ఎంట్రన్స్ టెస్ట్‌-2024 (CUET) యూజీ ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ విడుదల చేసింది. 2024-25 విద్యా సంవత్సరానికిగాను దేశంలోని సెంట్రల్‌ యూనివర్సిటీల్లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాలకోసం పరీక్షలు నిర్వహించగా అభ్యర్థుల లిస్ట్ రిలీజ్ చేశారు. అభ్యర్థులు తమ స్కోర్‌ కార్డును అధికారిక వెబ్‌సైట్ exams.nta.ac.in/CUET నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని ఎన్‌టీఏ అధికారులు సూచించారు.

ఉమ్మడి ప్రవేశ పరీక్ష..

ఇక స్కోర్‌ కార్టు డౌన్‌లోడ్ చేసుకునేందుకు అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (అండర్‌ గ్రాడ్యుయేషన్‌) దేశంలోని సెంట్రల్‌ యూనివర్సిటీల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష. ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులు దేశంలోని అన్ని సెంట్రల్‌ యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకుని ప్రవేశ ప్రక్రియలో పాల్గొనేందుకు వీలుంటుంది. అన్ని సెంట్రల్‌ వర్సిటీలకు ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షే ప్రామాణికం కావడంతో ఎన్‌టీఏ నిర్వహించే సీయూఈటీకి లక్షల మంది హాజరు అయ్యారు.

Also Read : గ్రూప్-2,3 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ‘పొంగులేటి శీనన్న నిరుద్యోగ కానుక’గా ఫ్రీ కోచింగ్!

#nta #results-released #cute-ug
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe