Heatwave: ఇవి ఎండలు కావు.. మండే అగ్నిగోళాలు..ఏకంగా 54 డిగ్రీల సెంటిగ్రేడ్..!

అమెరికా, జపాన్‌,యూరప్‌లోని పలు దేశాల్లోని ప్రజలను హీట్‌వేవ్‌ అల్లాడిస్తోంది. అమెరికాలోని ఫీనిక్స్‌లో వరుసపెట్టి 16రోజులుగా 43డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రత నమోదవుతుండగా..కాలిఫోర్నియా డెత్ వ్యాలీలో మరింత ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి ఉష్ణోగ్రతలు ఏకంగా 54డిగ్రీలకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Heatwave: ఇవి ఎండలు కావు.. మండే అగ్నిగోళాలు..ఏకంగా 54 డిగ్రీల సెంటిగ్రేడ్..!
New Update

ప్రపంచంలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తునే ఉన్నాడు. ఎండాకాలం ఏ దేశంలోనైనా అధిక ఉష్ణోగ్రతలు మాములే.. అయితే ఇప్పుడా పరిస్థితి పరిధి దాటింది. నమోదవాల్సిన దానికంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. నెల రోజుల ముందు వరకు ఇండియాలో ఇది దుస్థితి ఉండగా.. ఇప్పుడు అమెరికా, జపాన్‌, యూరప్‌లలోనూ హీట్‌వేవ్‌ పరిస్థితులు ప్రజలను అల్లాడిస్తున్నాయి. వచ్చే ఐదేళ్ల పాటు భూగోళం అగ్ని గుండంలా భగ్గుమంటుందని ఐక్యరాజ్యసమితి ఇటివలే హెచ్చరించింది. UNO అంచనాలకు తగ్గట్టుగానే ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి.

మూడు ఖండాల్లో అల్లాడుతున్న ప్రజలు:
అమెరికా, జపాన్‌,యూరప్‌లపై సూర్యుడు భగ్గుమంటున్నాడు. అమెరికాలో కాలిఫోర్నియా నుంచి టెక్సాస్ వరకు పవర్‌ఫుల్‌ హీట్ వేవ్ గరిష్ట స్థాయికి చేరుకుంటుందని అంచనా. పశ్చిమాన సాధారణం కంటే 10 నుంచి 20 డిగ్రీల ఫారెన్‌హీట్‌ల మధ్య పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతలు ఉండవచ్చని అక్కడి వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. అటు అన్నిటికంటే అరిజోనాలో పరిస్థితి మరింత భయానకంగా మారింది. రాష్ట్ర రాజధాని ఫీనిక్స్‌లో 109F (43 డిగ్రీల సెల్సియస్) నమోదైంది. అది కూడా ఒక్కరోజు కాదు.. వరుసపెట్టి 16రోజులు 43డిగ్రీల కంటే ఎక్కువగా టెంపరేచర్‌ రికార్డయింది.

54డిగ్రీల సెంటిగ్రేడ్‌?
అటు భూమిపై అత్యంత వేడిగా ఉండే ప్రదేశాలలో ఒకటైన కాలిఫోర్నియా డెత్ వ్యాలీ కూడా మరికొన్ని రోజుల్లో కొత్త రికార్డులు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడ ఏకంగా 130F(54C)కి ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే 48డిగ్రీల సెంటిగ్రేడ్‌ క్రాస్‌ అవ్వగా.. రాత్రిపూట కూడా 38డిగ్రీల సెల్సియస్‌ రికార్డవుతుంది. పెరుగుతున్న హీట్ వేవ్‌ పరిస్థితులు దృష్ట్యా అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. డిహైడ్రెషన్‌ బారిన పడకుండా మంచినీళ్లు ఎప్పటికప్పుడు తాగుతూ ఉండాలని చెబుతున్నారు. ఇక హీట్‌ వేవ్‌ కారణంగా దక్షిణ కాలిఫోర్నియాలోని అడవులకు మంటలు అంటుకున్నాయి. రివర్‌సైడ్ కౌంటీలో 3,000 ఎకరాల (1,214 హెక్టార్లు) కంటే ఎక్కువ అడవి కాలిపోయింది.

చరిత్రచూడని గరిష్ట ఉష్షోగ్రతలు:
అటు యూరప్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా టెంపరేచర్లు రికార్డవుతున్నాయి. రోమ్, బోలోగ్నా, ఫ్లోరెన్స్‌తో సహా 16 నగరాలకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే 40డిగ్రీల సెంటిగ్రేడ్‌కి ఉష్ణోగ్రతలు టచ్‌ అవుతుండగా.. రానున్న రెండు రోజుల్లో 43డిగ్రీల వరకు టెంపరేచర్‌ రీచ్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా రోమ్‌లో రేపు లేదా ఎల్లుండి నాటికి ఉష్ణోగ్రత 43డిగ్రీలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. 2007లో రోమ్‌లో 40.5డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా.. ఇప్పుడా రికార్డు బ్రేక్‌ అయ్యే ఛాన్సులు క్లియర్‌కట్‌గా కనిపిస్తున్నాయి. అటు తూర్పు జపాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో 39డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలా యూరప్‌, అమెరికా, ఆసియా ఖండాల్లో ఒకేసారి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇదంతా గ్లోబల్‌ వార్మింగ్‌ పీక్స్‌కి వెళ్తుందన్నడానికి శాంపులేనని.. ముందుముందు మరింత వేడి పరిస్థితులు తప్పవని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe