MLA Koushik Reddy: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు అయింది. కరీంనగర్ జడ్పీ సమావేశంలో ధర్నాకు దిగి కలెక్టర్ విధులకు ఆటంకం కలిగించారని జిల్లా పరిషత్ సీఈవో శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. దళితబంధుతో పాటు DEO అంశంపై కలెక్టర్ సమాధానం చెప్పాలని కౌశిక్ డిమాండ్ చేశారు.
అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించిన కలెక్టర్‌ను అడ్డుకొని మెట్లపై బైఠాయించారు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి. జిల్లా విద్యాశాఖాధికారిని సస్పెండ్ చేయాలని ప్లకార్డులతో నిరసన చెప్పట్టారు. జడ్పీటీసీలతో కౌశిక్‌రెడ్డి వాగ్వాదంతో ఉద్రిక్తత నెలకొంది. కొత్తగా అమల్లోకొచ్చిన BNS యాక్ట్ ప్రకారం 221, 126 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హుజూరాబాద్ లో విద్యారంగంలో సమస్యలపై టీచర్లు, విద్యాశాఖాధికారులతో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి సమీక్ష చేశారు. ఆ రివ్యూ మీటింగ్‌కు హాజరైన MEOలను ట్రాన్స్‌ఫర్ చేశారు DEO. ఆ DEOను సస్పెండ్ చేయాలని కలెక్టర్‌ను పట్టుబట్టారు కౌశిక్‌రెడ్డి