/rtv/media/media_files/2026/02/12/jesse-van-rootselaar-2026-02-12-09-18-53.jpg)
కెనడాలోని ఓ సెకండరీ స్కూల్లో ట్రాన్స్‌జెండర్ రక్తపాతం సృష్టించింది. బ్రిటిష్ కొలంబియా రాష్ట్రం టంబ్లర్ రిడ్జ్ పట్టణంలో ఫిబ్రవరి 10న ఘోర విషాదం చోటుచేసుకుంది. 18ఏళ్ల ట్రాన్స్‌జెండర్ యువతి జరిపిన కాల్పుల్లో మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. నిందితురాలు ఫస్ట్ ఇంట్లో ఉన్న తల్లిని, తమ్ముడిని కాల్చి చంపి, తర్వాత స్థానిక పాఠశాల్లోకి వచ్చి స్టూడెంట్స్, టీచర్స్‌పై గన్‌తో విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 9మంది చనిపోయారు. పోలీసుల కథనం ప్రకారం.. 18 ఏళ్ల జెస్సీ వాన్ రూట్‌సెలార్ అనే యువతి ఈ దారుణానికి ఒడిగట్టింది. మంగళవారం మధ్యాహ్నం ఆమె నివాసంలోనే తన తల్లిని(39), తన 11 ఏళ్ల తమ్ముడిని తుపాకీతో కాల్చి చంపింది. తర్వాత నేరుగా టంబ్లర్ రిడ్జ్ సెకండరీ స్కూల్‌కు చేరుకుని అక్కడ విచక్షణా రహితంగా కాల్పులు జరిపింది.
స్కూల్లోకి ప్రవేశించిన జెస్సీ ఒక్కసారిగా విద్యార్థులు, ఉపాధ్యాయులపై కాల్పులు మొదలుపెట్టింది. ఈ దాడిలో ఓ మహిళా ఉపాధ్యాయురాలితో పాటు ఐదుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల శబ్దంతో స్కూల్ మొత్తం దద్దరిల్లింది. సమాచారం అందుకున్న రాయల్ కెనేడియన్ మౌంటెడ్ పోలీస్ ఘటనా స్థలానికి చేరుకునేలోపే నిందితురాలు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో మరో 25 మందికి పైగా గాయపడ్డారు. పోలీసు విచారణలో జెస్సీకి సంబంధించిన కీలక విషయాలు వెల్లడయ్యాయి.
జెస్సీ పుట్టుకతో పురుషుడు అయినప్పటికీ, సుమారు ఆరేళ్ల క్రితం మహిళగా మారుతూ ట్రాన్సిషన్ ప్రారంభించింది. సామాజికంగా ఆమె మహిళగానే గుర్తింపు పొందింది. గతంలో జెస్సీ మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా పలుమార్లు పోలీసుల నిఘాలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆమె మెంటల్ హెల్త్ చెక్అప్ కోసం గతంలోనూ పోలీసులు జెస్సీ ఇంటికి వెళ్లారు. ఆమె నాలుగేళ్ల క్రితమే స్కూల్ నుంచి డ్రాపౌట్, ప్రస్తుతం ఆమె ఆ స్కూల్ విద్యార్థిని కాదని పోలీసులు స్పష్టం చేశారు.
ఈ ఘటనపై కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండాను సగం వరకు దించి బాధితులకు నివాళులర్పించారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
Follow Us