CRIME: వరంగల్ నరబలి కేసులో బిగ్ ట్విస్ట్.. కన్న తల్లే కూతురిని..!

భూపాలజిల్లా నరబలి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. 22 ఏళ్ల వర్షిణి హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల దర్యాప్తులో తల్లే హంతకురాలని తేలింది.

New Update

CRIME: భూపాల్ పల్లి  జిల్లా నరబలి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. 22 ఏళ్ల వర్షిణి హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల దర్యాప్తులో తల్లే హంతకురాలని తేలింది. ఈ కేసులో వర్షిణి తల్లి కవితను  పోలీసులు అదుపులోకి తీసుకొని  విచారించగా.. దిమ్మతిరిగే నిజాలు బయటపెట్టింది. కూతురుని తానే చంపినట్లు అంగీకరించింది. అయితే తన అక్రమసంబంధం గురించి కూతురికి తెలియడంతో.. సుపారీ ఇచ్చి కూతురిని హత్య చేయినట్లు ఒప్పుకుంది.  అంతేకాదు తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని  2 నెలల కిందట పక్షవాతంతో బాధపడుతున్న భర్తను కూడా ప్రియుడితో కలిసి హత్య చేయించినట్లుగా తేలింది. 

అసలేం జరిగింది.. 

అయితే ఆదివారం రోజు  జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా జాతీయ రహదారి మార్గంలోని కాటారం శివారు మేడిపల్లి అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో కుళ్లిపోయిన ఓ యువతి మృతదేహం లభ్యమైంది.  స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. డెడ్ బాడీ పక్కన పడున్న ఆధార్ కార్డు ఆధారంగా  యువతిని చిట్యాల మండలం ఒడితల గ్రామానికి చెందిన వర్షిణిగా గుర్తించారు. ఘటనా  స్థలంలో ఘటనా స్థలంలో నిమ్మకాయలు, పసుపు, కుంకుమ ఆనవాళ్లు ఉండటంతో  క్షుద్రపూజలు చేసి బలిచ్చారనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.  అయితే రెండు నెలల కిందట వర్షిణి తండ్రి కుమారస్వామి అనారోగ్యంతో మృతి చెందగా.. వర్షిణి ఆవేదనతో ఈనెల 3న ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు తల్లి కవిత  చిట్యాల పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేసింది. ఈ మేరకు  కేసు నమోదు చేసిన పోలీసులు మిస్సింగ్‌ కేసుగా దర్యాప్తు చేశారు. ఈ క్రమంలోనే వర్షీణీ  మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. 

తల్లే హంతకురాలు 

20 రోజుల క్రితం  ఇంటినుంచి వెళ్లిపోయిన వర్షిణీ అనుమానస్పందంగా మృతి చెందడంపై పలు రకాల ప్రశ్నలు తలెత్తాయి. దీంతో పోలీసులు అన్ని కోణాల్లో విచారించగా అసలు విషయం బయటపడింది. తల్లే హంతకురాలని తేలింది. తన వివాహేతర సంబంధం గురించి కూతురికి తెలిసిపోయిందనే భయంతో మర్డర్ కి స్కెచ్ వేసింది. మళ్ళీ ఏమీ తెలియని అమాయకురాలిగా కూతురు మిస్సింగ్ అంటూ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. కొందరికి సుపారీ ఇచ్చి కూతురిని హత్య చేయింది. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహం పక్కన నిమ్మకాయలు , పసుపు, కుంకుమ వేసి క్షుద్రపూజల వైపు దృష్టి మళ్లేలా చేశారు. 

కూతురి ప్రాణం తీసిన వివాహితర సంబంధం 

కూతురిని మాత్రమే కాదు రెండు నెలల కిందట అనారోగ్యంతో బాధపడుతున్న భర్త కుమారస్వామి చావు వెనుక కూడా కవిత హస్తం ఉందని తేలింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో బయట పడింది. అయితే కవితకు అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ కేసులో కవితతో పాటు  పాటు మరో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు  క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.  

Advertisment
తాజా కథనాలు