Monta Toofan: మొంథా తుఫాన్.. వరద నీటిలో గల్లంతై ఏడుగురు మృతి!

ఉమ్మడి వరంగల్ మొంథా తుఫాన్ పెను విషాదాన్ని మిగిల్చింది. వరద నీటిలో గల్లంతై ఏడుగురు మృతి చెందారు. మృతులను కృష్ణమూర్తి, సూరమ్మ, శ్రీనివాస్, నాగేంద్ర, శ్రావ్య, సంపత్, అనిల్ గా గుర్తించారు.

New Update
montha toofan

montha toofan

Monta Toofan: గత వారం రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొంథాతుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. మొంతాతుఫాన్ ప్రభావంతో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. హన్మకొండ, ఉమ్మడి వరంగల్, మహబూబాబాద్, నల్గొండ పలు జిల్లాలో వరద నీరు బీభత్సం సృష్టిస్తోంది.  నిన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వరద నీటిలో గల్లంతై ఏడుగురు మృతి చెందారు. మృతులను కృష్ణమూర్తి, సూరమ్మ, శ్రీనివాస్, నాగేంద్ర, శ్రావ్య, సంపత్, అనిల్ గా గుర్తించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం  వరంగల్ MGM మార్చురీకి ఆస్పత్రికి తరలించారు. 

మొంథా తుపాను ప్రభావం

ఇదిలా ఉంటే.. మొంథా తుపాను ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ, కరీంనగర్‌ జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కకున్నాయి. హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండడంతో గ్రామాలు, పట్టణాలు చెరువులను తలపిస్తున్నాయి. చేతికొచ్చిన పంటను అమ్ముదామని మార్కెట్‌కు తీసుకెళ్లిన రైతులకు పంట కొట్టుకుపోవడంతో లబోదిబోమంటున్నారు. నిన్నటివరకు ఏపీపై ప్రభావం చూపిన మొంథా ఒక్కసారిగా దిశ మార్చుకోవడంతో తెలంగాణ నిండా మునిగింది. భారీ వర్షాలకు వరంగల్‌ లోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. ప్రధానంగా వరంగల్‌ నగరంతో పాటు హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లోని పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. వరంగల్ -హనుమకొండ మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. 

TG NEWS: పెళ్ళైన కొద్ది గంటల్లోనే ఘోర రోడ్డు ప్రమాదం.. నుజ్జు నుజ్జయిన కారు స్పాట్ లో 12 మంది!

Advertisment
తాజా కథనాలు