BIG BREAKING: తెలంగాణలో దారుణం.. నలుగురి ప్రాణం తీసిన టిప్పర్.. రాంగ్ రూట్లో వచ్చి..!-VIDEO

కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం జంగంపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ నేషనల్ హైవే పై టిప్పర్ స్కూటీనీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. 

New Update
accident

accident

Kamareddy Accident: కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం జంగంపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ నేషనల్ హైవే పై టిప్పర్ స్కూటీనీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. స్క్యూటీ పై పెద్దలు , ఇద్దరు పిల్లలు వెళ్తుండగా.. పెద్దలు, ఒక బాబు స్పాట్ లోనే మృతి చెందారు. పాపకు తీవ్రంగా గాయాలు కావడంతో.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, చికిత్స పొందుతూ పాప కూడా మరణించినట్లు సమాచారం. దీంతో ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 

ముగ్గురు స్పాట్ డెడ్ 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. టిప్పర్ రాంగ్ రూట్ లో రావడమే ప్రమాదానికి కారణమని గుర్తించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: HOME GUARD ABORT : ప్రేమ పేరుతో మోసం చేసిన హోంగార్డు..అబార్షన్ వికటించి యువతి మృతి

Advertisment
తాజా కథనాలు