Hyderabad News: కూకట్‌పల్లి సహస్ర హత్య కేసులో వీడిన మిస్టరీ.. చంపింది వీడే?

 కూకట్‌పల్లిలో పదేళ్ల బాలిక సహస్ర హత్య కేసులో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మొదటి  అనుమానితుడైన సంజయ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంజయ్ హత్య గురైన  సహస్ర ఉంటున్న ఇంట్లోనే పై పోర్షన్ లో  అద్దెకు ఉంటున్నాడు . 

New Update

Hyderabad News:   ఇటీవలే హైదరాబాద్ కూకట్ పల్లిలో 12ఏళ్ళ బాలిక సహస్రను గుర్తుతెలియని  దుండగులు దారుణంగా హత్య చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.  అయితే తాజాగా ఈ హత్య కేసులో ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. 

అదుపులోకి అనుమానితుడు 

సహస్ర ఇంటి పై పోర్షన్ లో అద్దెకు ఉంటున్న సంజయ్ అనే యువకుడిని అనుమానితుడిగా  అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం అతడిని స్టేషన్ కి తీసుకెళ్లి విచారిస్తున్నారు. ఈ సందర్భంగా బాలానగర్ డీసీపీ మాట్లాడుతూ.. హంతకుడి కోసం పోలీసులు ఆరు బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఏ చిన్న క్లూ కూడా మిస్ అవ్వకుండా సీసీటీవీ ఫుటేజ్ లు, ఇతర సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నట్లు వివరించారు. హంతకుడిని కనిపెట్టేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించారు. హత్య చేసిందెవరనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని అన్నారు. 

అసలేం జరిగింది.. 

 కూకట్ పల్లిలోని సంగీత్ నగర్ లో నివాసం ఉంటున్న బైక్ మెకానిక్ కృష్ణ, ల్యాబ్ టెక్నీషియన్ రేణుకకు 12 ఏళ్ల కూతురు సహస్ర, ఒక కొడుకు ఉన్నారు. అయితే సోమవారం వీరిద్దరూ ఎవరి పనికి వాళ్ళు వెళ్లిన తర్వాత .. ఇంట్లో ఒంటరిగా ఉన్న కూతురు సహస్ర దారుణ హత్యకు గురైంది. గుర్తుతెలియని దుండగులు చిన్నారి గొంతు కోసి.. కత్తితో పొడిచి అతి కిరాతకంగా చంపేసి పారిపోయారు. 

కొద్దిసేపటి తర్వాత తండ్రి కృష్ణ ఇంటికి వచ్చి చూడగా.. కూతురు బెడ్ పై బెడ్ పై విగతజీవిగా పడుంది! ఆ చిన్నారి ఒంటిపై కత్తిపోట్లు ఉండడంతో తండ్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే కూకట్ పల్లి పోలీసులకు సమాచారం అందించగా.. ఘటన స్థలానికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ తో ఘటన స్థలాన్ని పరిశీలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సహస్య హత్య పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలిసిన వ్యక్తులు లేదా ఇంటి చుట్టుపక్కల వాళ్ళే ఈ పని చేసుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.  ఇందులో భాగంగానే మొదటి అనుమానితుడిగా  సహస్య ఇంటి వద్దే నివాసం ఉంటున్న  సంజయ్ ని అదుపులోకి తీసుకున్నారు. 

సహస్ర మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తాము ఇంట్లో లేని సమయం చూసి హత్య చేశారని రోధిస్తున్నారు. ఇంట్లో  ఒకవేళ తన కొడుకు ఉంటే.. అతడిని కూడా చంపేవారేమో అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో మనుషులకు, మానవ సంబంధాలకు విలువ లేకుండా పోతుంది. పరువు, ప్రతీకరాల పేరుతో మనిషి ప్రాణాలను సైతం తీసెందుకు వెనకాడడం లేదు. కన్న బిడ్డలను, కట్టుకున్న వారిని కూడా కడతీర్చే రోజులు చూస్తున్నాము. మరోవైపు ఆడపిల్లలపై ఆకృత్యాలు కూడా పెరిగిపోయాయి. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నారు కొందరు దుర్మార్గులు. 

Also Read: Viveka murder case : వివేకా కేసులో బిగ్‌ట్విస్ట్‌.. కుమార్తె, అల్లుడిపై కేసులను క్వాష్‌ చేసిన సుప్రీం కోర్టు

Advertisment
తాజా కథనాలు