Hyderabad : హైదరాబాద్ (Hyderabad) గణేష్ ఉత్సవాల్లో మహిళలను వేధిస్తున్న పలువురు బ్యాడ్ బాయ్స్ పట్టుబడ్డారు. ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనం కోసం క్యూ లైన్లో వస్తున్న మహిళా భక్తుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన 285 మంది పోకిరిలను అదుపులోకి తీసుకున్నట్లు తెలంగాణ పోలీసు (Telangana Police) మహిళా భద్రతా విభాగం తెలిపింది. అలాగే ఓల్డ్‌సిటీలో పలు ఉత్సవాల్లో కొందరు వ్యక్తులు బహిరంగ ప్రదేశాల్లో అనుచితంగా ప్రవర్తిస్తూ భక్తుల పట్ల నీచంగా ప్రవర్తిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని షీ టీమ్స్ అదుపులోకి తీసుకున్నాయి. వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుని, మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామని పోలీసు అధికారులు తెలిపారు.
Also Read : హైడ్రాను ఇక టచ్ చేయలేరు.. రేవంత్ సర్కార్ సంచలన వ్యూహం!
Ganesh Festival :
ఈ మేరకు ఇలాంటి దుష్ప్రవర్తనను సహించబోమని, వేధింపులు లేదా ఆటపట్టింపులకు సంబంధించిన ఏదైనా సంఘటనలను అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు. అనుచిత ప్రవర్తన తమ కంటపడితే వెంటనే ధైర్యంగా తమకు రిపోర్ట్ చేయాలని హైదరాబాద్ పోలీసులు సూచించారు. తెలంగాణ పోలీసు విభాగంలోని షీ టీమ్స్.. అందరికీ రక్షణ కల్పించడానికి, సురక్షితమైన వాతావరణాన్ని నెలకొల్పేందుకు అన్ని ప్రాంతంలో నిరంతరం పెట్రోలింగ్ చేస్తున్నాయని అధికారులు చెప్పారు. రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాలలో ఈవ్-టీజర్‌లు, స్టాకర్లు, మహిళలను వేధించేవారిని గుర్తించి వెంటనే అరెస్టు చేస్తున్నట్లు తెలిపారు. 'రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో మీ ప్రవర్తనను మా షీ టీమ్స్ రికార్డ్ చేస్తున్నాయి. మీరు ఎక్కడ దురుసుగా ప్రవర్తించినా మిమ్మల్ని జైలులో వేయడమే ఏకైక మంత్రం' అంటూ ఎక్స్ వేదికగా ఒక వీడియోను కూడా పోస్ట్ చేశారు.
Also Read : హైకోర్టు బిగ్ షాక్.. హైడ్రా ఆగిపోతుందా ?