Viral Video: : "హలో బ్రో, సె*క్స్ చేస్తావా? వాట్సాప్ నంబర్ ఇవ్వు".. ఉబర్ డ్రైవర్ షాక్! అసలేం జరిగిందంటే..?

గురుగ్రామ్‌లో Uber డ్రైవర్ విశాల్‌కు రైడ్ బుక్ చేసిన ఓ కస్టమర్ అసభ్యమైన మెసేజ్‌లు పంపి “బ్రో, సె*క్స్ చేస్తావా? వాట్సాప్ నంబర్ ఇవ్వు” అని అడిగాడు. డ్రైవర్ తిరస్కరించడంతో రైడ్ క్యాన్సిల్ చేసాడు కస్టమర్. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

New Update
Viral Video

Viral Video

Viral Video: హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ లో ఒక అతి అసభ్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడి Uber డ్రైవర్ విశాల్ ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు, ఇందులో అతను ఒక కస్టమర్ నుండి అసభ్యమైన మెసేజ్‌లు అందిందని తెలిపారు.

వీడియో ప్రకారం, కస్టమర్ ISKCON ఆలయానికి వెళ్లడానికి రైడ్ బుక్ చేసుకున్నారు. రైడ్ కన్ఫర్మ్ అయిన తర్వాత, కస్టమర్ డ్రైవర్‌కు “హలో బ్రో, సెక్స్ చేస్తావా? ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ నంబర్ ఇవ్వు” అంటూ వ్యక్తిగతంగా అసభ్య మెసేజ్‌లు పంపించారు. డ్రైవర్ అంగీకరించకపోవడంతో, కస్టమర్ వెంటనే రైడ్‌ను క్యాన్సిల్ చేశారు.

Gurugram Uber Driver Incident

డ్రైవర్ ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అసభ్య ప్రవర్తన ఇప్పటి వరకు బైక్ టాక్సీ డ్రైవర్‌లకు మాత్రమే ఎదురయ్యేది, కానీ ఇప్పుడు క్యాబ్ డ్రైవర్‌లకూ ఎదురవుతోందని చెప్పారు. కస్టమర్ సమస్యలను కంపెనీ వెంటనే చూసుకుంటుంది, కానీ డ్రైవర్‌లకు ఇలాంటివి ఎదురైతే పెద్దగా చర్యలు తీసుకోవడం లేదు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్లు డ్రైవర్లతో ఇలాంటి ప్రవర్తన తప్పని, కస్టమర్ల భద్రత, డ్రైవర్ భద్రత, ఆన్‌లైన్ ప్రవర్తనపై చర్చలు మొదలుపెట్టారు.

ఈ ఘటన ద్వారా క్యాబ్ డ్రైవర్‌ల భద్రతను మరింత పరిగణనలోకి తీసుకోవడం, కస్టమర్ ప్రవర్తనపై సక్రమ చర్యలు తీసుకోవడం అవసరమని సోషల్ మీడియా వినియోగదారులు అభిప్రాయపడ్డారు.

Advertisment
తాజా కథనాలు