Chevella Accident: ముగ్గురు బిడ్డల మరణంతో సొమ్మసిల్లిన తల్లి.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో!

చేవెళ్ల బస్సు ప్రమాదం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు  తనూషా, సాయి ప్రియా, నందిని స్పాట్ లో మృతి చెందారు. 

New Update
Bus Accident Chevella

Bus Accident Chevella

Chevella  Accident: చేవెళ్ల బస్సు ప్రమాదం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు  తనూషా, సాయి ప్రియా, నందిని స్పాట్ లో మృతి చెందారు.   ముగ్గురు అక్కచెల్లు ఈరోజు ఉదయం బస్సులో  తాండూరు నుంచి హైదరాబాద్ బయలుదేరగా.. చేవెళ్ల వద్ద బస్సు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. రాంగ్ రూట్ లో వస్తున్న టిప్పర్ లారీ అతి వేగంతో ఆర్టీసీ బస్సుపైకి దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ తో సహా 24 మందికి పైగా ప్రయాణికులు మృతిచెందారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి చెందడం ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. 

సొమ్మసిల్లిన తల్లి 

సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న తనూషా, సాయి ప్రియా, నందిని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ముగ్గురు బిడ్డల మరణంతో ఆ తల్లి గుండెపగిలేలా రోధిస్తుంది.  బిడ్డల మరణ వార్త తెలియగానే తల్లి సొమ్మసిల్లి పడిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అందరి హృదయాలను కలచివేస్తున్నాయి. తాండూరు వడ్డెర గల్లీకి చెందిన తనూషా, సాయి ప్రియా, నందిని హైదరాబాద్ లోని కోటీ ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నారు. ఈరోజు ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉండడంతో ముగ్గురు హైదరాబాద్ బయలు దేరినట్లు తెలుస్తోంది. ఇంతలోనే ముగ్గురు ఘోర ప్రమాదంలో మృతి చెందడం కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. ఎల్లయ్య గౌడ్ డ్రైవర్ పని చేస్తూ తన ముగ్గురు పిల్లల్ని చదివిస్తున్నారు. మొత్తం నలుగురు ఆడపిల్లలు ఉండగా.. ఒక అమ్మాయికి పెళ్లి జరిగింది. మిగతా ముగ్గురు హైదరాబాద్ లో చదువుకుంటున్నారు. గత నెల 15న కుటుంబంలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో కూడా ఈ ముగ్గురు సంతోషంగా గడిపారు. 

మరో తల్లి ఆవేదన.. 

ఈ ప్రమాదంలో యాలాల మండలం లక్ష్మీ నారాయణపూర్ కు చెందిన అఖిల రెడ్డి అనే యువతి కూడా మృతి చెందింది. హైదరాబాద్ లో ఎంబీఏ చదువుతున్న అఖిల ఇంటి నుంచి తిరిగి కాలేజ్ వెళ్తుండగా బస్సు ప్రమాదంలో మరణించింది. ఘటన స్థలానికి చేరుకున్న అఖిల తల్లి, కుటుంబ సభ్యులు  కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కూతురిని తలుచుకుంటూ ఆ తల్లి బోరున విలపించింది. 

Also Read: Andhra King Taluka: 'ఆంధ్రా కింగ్ తాలూకా' ముగిసింది.. హీరో రామ్ భావోద్వేగ పోస్ట్!

Advertisment
తాజా కథనాలు