BREAKING NEWS : పుప్పాలగూడ డబుల్ మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్

పుప్పాలగూడలో జరిగిన డబుల్ మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్  చోటుచేసుకుంది.   బిందు, సాకేత్‌ హత్యలకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తేల్చారు. సాకేత్‌తో ఒకవైపు లవ్ ట్రాక్ నడుపుతూనే మరో యువకుడితో కూడా  బిందు టచ్ లో ఉన్నట్లుగా పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు.

New Update
puppalaguda double murder case

puppalaguda double murder case Photograph: (puppalaguda double murder case)

హైదరాబాద్ నార్సింగి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పుప్పాలగూడలో జరిగిన  డబుల్ మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్  చోటుచేసుకుంది.  అనంత పద్మనాభస్వామి ఆలయ గుట్టల వద్ద బిందు (25) అనే యువతి సాకేత్‌ (25)అనే యువకుడు  దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. వీరి హత్యలకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తేల్చారు. సాకేత్‌తో ఒకవైపు లవ్ ట్రాక్ నడుపుతూనే మరో యువకుడితో కూడా  బిందు టచ్ లో ఉన్నట్లుగా పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. వీరిద్దరిని  పుప్పాలగూడలో చూసిన ఆ యువకుడు బిందుని బండరాయితో కొట్టి చంపేశాడు.  పారిపోతున్న సాకేత్ ను వెంటాడి మరి ఆ యువకుడు చంపేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. 

మిస్సింగ్ కేసులు నమోదు

హత్యకు గురైన బిందుకు ముగ్గురు పిల్లలున్నారు.  గచ్చిబౌలిలో సాకేత్, వనస్థలిపురంలో బిందులపై మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి.  సాకేత్,బిందుల మధ్య గతకొంతకాలంగా వివాహేతర సంబంధం నడుస్తోంది.  జనవరి 11వ తేదీన బిందును ఎల్బీనగర్ నుంచి నానక్‌రామ్‌గూడకు పిలిపించాడు.  నిన్న అంటే జనవరి 14వ తేదీన  పుప్పాలగూడ గుట్టల్లో ఏకాంతంగా ఉండగా మరో ప్రేమికుడికి వీరు అడ్డంగా దొరికిపోయారు.  దీంతో వీరిని అతను హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సాకేత్‌ హౌస్‌ కీపింగ్‌ చేస్తూ నానక్‌రామమ్‌గూడలో ఉంటున్నాడు. బింధు ఎల్బీనగర్‌లో నివాసం ఉంటున్నది. బిందు కుటుంబ సభ్యులపై కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హంతకుడి కోసం మూడు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్లు నార్సింగి పోలీసులు తెలిపారు.

ఇక సాకేత్ మధ్యప్రదేశ్‌కి చెందిన వ్యక్తి కాగా.. బిందు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అమ్మాయి. వేర్వేరు రాష్ట్రాలకు చెందిన వీరిద్దరికి ఎలా పరిచయం ఏర్పడింది అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. సాకేత్ డెడ్ బాడీకి 60 మీటర్ల దూరంలో బిందు డెడ్ బాడీ కనిపించింది. అయితే బిందు వివస్త్రగా కనిపించడంతో పోలీసుల మరో కోణంలో కూడా దర్యాప్తు విచారిస్తున్నారు. ఈ కేసు గురించి  క్లూస్ టీమ్ ద్వారా మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు.  

Also Read :  క్రిటికల్ కండిషన్‌లో లాస్ ఏంజెలెస్ కార్చిచ్చు..మరింత వేగంగా గాలులు..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు