Boat Accident: ఘోర పడవ ప్రమాదం..నదిలో మునిగి 64 మంది రైతులు మృతి! నైజీరియాలోని జంఫారాలో నదిలో శనివారం ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కనీసం 64 మంది రైతులు మరణించారు. రైతులను పొలాలకు వెళ్తుండగా..ఈ ఘటన చోటు చేసుకుంది. By Bhavana 15 Sep 2024 in క్రైం ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి Boat Accident: నైజీరియాలోని జంఫారాలో నదిలో శనివారం ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కనీసం 64 మంది రైతులు మరణించారు. రైతులను పొలాలకు వెళ్తుండగా..ఈ ఘటన చోటు చేసుకుంది. వాయువ్య నైజీరియాలోని జంఫారా రాష్ట్రం గుమ్మి పట్టణ సమీపంలో శనివారం ఉదయం 70 మంది రైతులను పొలాల్లోకి దించేందుకు వెళ్తున్న చెక్క పడవ ఆకస్మాత్తుగా బోల్తా పడింది. ఘటన గురించి సమాచారం అందిన వెంటనే.. స్థానిక అధికారులు రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారు. మూడు గంటల తర్వాత, ఆరుగురు ప్రాణాలతో బయటపడినట్లు అధికారులు తెలిపారు. “గుమ్మి స్థానిక ప్రభుత్వ ప్రాంతంలో ఇలాంటి సంఘటన జరగడం ఇది రెండోసారి” అని సహాయక చర్యలకు నాయకత్వం వహించిన స్థానిక నిర్వాహకుడు అమీను నుహు ఫలాలే వివరించారు. 900 మందికి పైగా రైతులు తమ పొలాలకు చేరుకునేందుకు నిత్యం నదిని దాటుతుంటారు. అయితే రెండు పడవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీని ఫలితంగా తరచుగా రద్దీ పెరుగుతుందని స్థానికులు పేర్కొన్నారు అవి కూడా చెక్క పడవలు కావడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వారు వివరించారు. ఇప్పటికే ఖనిజ వనరులపై నియంత్రణ కోరుతూ క్రిమినల్ ముఠాల బారిన పడిన జంఫారా రాష్ట్రం కూడా భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలతో తీవ్రంగా నష్టపోయింది. రెండు వారాల క్రితం వరదలు 10,000 మందికి పైగా నివాసితులను తరలించామని స్థానిక అధికారులు తెలిపారు. Also Read: అధికారుల వెనక ఉన్న నేతలను కూడా వదిలిపెట్టం.. RTV ఇంటర్వ్యూలో రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు! మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి