Guntur: బడి నుంచి వెళ్లి.. గ్యాస్ డెలివరీ బాయ్‌ ఇంట్లో శవమైన విద్యార్థిని..!

గుంటూరు జిల్లా కొత్తరెడ్డిపాలెంలో సెవెన్త్‌ క్లాస్‌ విద్యార్థిని శైలజ మృతి మిస్టరీగా మారింది. ఉదయం స్కూలుకు వెళ్లిన శైలజ కడుపు నొప్పి అని స్కూలు నుంచి వచ్చేసింది. ఆ తర్వాత శైలజ గ్యాస్‌ డెలివరీ బాయ్‌ నాగరాజు ఇంట్లో శవమై కనిపించింది. దీంతో శైలజ మృతిపై అనుమానం వ్యక్తం చేసింది కుటుంబం.

New Update
Guntur: బడి నుంచి వెళ్లి.. గ్యాస్ డెలివరీ బాయ్‌ ఇంట్లో  శవమైన విద్యార్థిని..!

Guntur: గుంటూరు జిల్లా చేబ్రోలు కొత్తరెడ్డిపాలెం గ్రామంలో అనుమానాస్పద ఘటన చోటుచేసుకుంది. బడికి వెళ్లిన విద్యార్థిని మళ్ళీ తిరిగిరాని లోకానికి వెళ్ళింది. ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థిని శైలజ మృతి మిస్టరీగా మారింది. ఉదయాన్నే స్కూల్ కు వెళ్లిన శైలజ కొంత సమయం తర్వాత కడుపు నొప్పి అని స్కూల్ నుంచి వచ్చేసింది. అలా బడి నుంచి వచ్చిన అమ్మాయి గ్యాస్‌ డెలివరీ బాయ్‌ నాగరాజు ఇంట్లో శవమై కనిపించింది.

దీంతో శైలజ మృతి పట్ల అనుమానం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నాగరాజు ఇంటిని పరిశీలించగా.. అతని ఇంట్లో శైలజ బుక్స్, బ్యాగ్ దొరికాయి. ప్రస్తుతం డెలివరీ బాయ్ నాగరాజు పరారీలో ఉన్నట్లు సమాచారం. పోస్టుమార్టం కోసం శైలజ మృతదేహం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు.

Also Read: Adilabad: ఆదిలాబాద్ లో పట్టపగలే దారుణం.. భార్య గొంతు కోసిన భర్త..! - Rtvlive.com

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు