రామోజీరావుకి బిగ్‌ షాక్‌... కోట్లు విలువైన చరాస్తులను జప్తు చేసిన సీఐడీ!

మార్గదర్శి చిట్ ఫండ్స్ ఛైర్మన్ రామోజీ రావుపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేసిన కేసు కీలక మలుపు తిరిగింది. మరోసారి మార్గదర్శి చిట్స్‌కి చెందిన ఆస్తుల్ని భారీగా అటాచ్ చేస్తూ ఏపీ సీఐడీ షాక్‌ ఇచ్చింది. ఈసారి ఏకంగా రూ. 242 కోట్ల ఆస్తులు (చరాస్తులు) జప్తు చేసినట్లు తెలుస్తోంది. మార్గదర్శి ఛిట్ ఫండ్స్ సంస్థ ఛైర్మన్ రామోజీ రావు, ఎండీ శైలజా కిరణ్, ఇతర బ్రాంచ్ మేనేజర్ల పేర్లను ఇందులో పొందుపరిచారు. 

రామోజీరావుకి బిగ్‌ షాక్‌... కోట్లు విలువైన చరాస్తులను జప్తు చేసిన సీఐడీ!
New Update

మార్గదర్శి అక్రమాల కేసులో ఇప్పటికే దర్యాప్తును ముమ్మరంగా కొనసాగిస్తున్న ఏపీ సీఐడీ.. ఆ కంపెనీ అధినేత, ఎండీ అయిన రామోజీరావు, శైలజాకిరణ్‌లను పలుమార్లు విచారించిన సంగతి తెలిసిందే. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ చందాదారులు, డిపాజిట్‌దారుల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలోనూ ఇలాంటి కీలక నిర్ణయం తీసుకుంది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు చెందిన రూ.793.50 కోట్ల విలువైన చరాస్తులను జప్తు చేసేందుకు సీఐడీని అనుమతించింది. వాటిలో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ నగదు, బ్యాంకు ఖాతాల్లో సొమ్ము, నిబంధనలకు విరుద్ధంగా మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టిన పెట్టుబడులున్నాయి.

కేంద్ర చిట్‌ఫండ్స్‌ చట్టాన్ని ఉల్లంఘిస్తూ మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ దశాబ్దాలుగా ఆర్థిక అక్రమాలను పాల్పడుతున్నట్లు స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ తనిఖీల్లో వెల్లడైంది. చందాదారుల సొమ్మును నిబంధనలకు మార్గదర్శి తమ అనుబంధ సంస్థలు, మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులుగా మళ్లించినట్లు కీలక ఆధారాలు సేకరించింది. చిట్‌ఫండ్స్‌ రిజిస్ట్రార్‌ ఫిర్యాదు మేరకు ఏ–1గా చెరుకూరి రామోజీరావు, ఏ–2గా చెరుకూరి శైలజ కిరణ్‌లతోపాటు బ్రాంచి మేనేజర్లపై (ఫోర్‌మెన్‌) సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న విషయం విదితమే. కేంద్ర చిట్‌ఫండ్‌ చట్టాన్ని అనుసరిస్తున్నట్లు ఆధారాలు చూపితే కొత్త చిట్టీలకు అనుమతిస్తామని స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ సూచించినా మార్గదర్శి అందుకు నిరాకరించింది.

మార్గదర్శిలో డబ్బులను డిపాజిట్ చేసిన చందాదారుల నిధుల మళ్లించినట్లు అధికారులు నిర్ధారించారు. 40 సంస్థలకు వాటిని మళ్లించినట్లు గుర్తించారు. ఈ 40 సంస్థల పేర్లను ఈ జీఓలో పొందుపరిచారు. డీమార్ట్‌ను నిర్వహిస్తోన్న అవెన్యూ సూపర్ మార్కెట్స్, భారతి ఎయిర్‌టెల్, సెంచరీ టెక్స్‌టైల్స్ వంటి సంస్థలకు నిధులను మళ్లించినట్లు గుర్తించారు. ఐసీఐసీఐ బ్యాంక్ లిమిటెడ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇన్వెస్ట్‌మెంట్స్, ఆదిత్య బిర్లా కేపిటల్, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, బంధన్ మ్యూచువల్ ఫండ్‌లకు మార్గదర్శి డిపాజిట్లను మళ్లించినట్లు హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. అయితే ఈ ఆస్తులను అటాచ్ చేసినట్లు రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ కొద్దిసేపటి కిందటే వెల్లడించింది. ఈ మేరకు జీఓ నంబర్ 116ను జారీ చేసింది. ఈ జీఓను హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా విడుదల చేశారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe