/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/v-3-jpg.webp)
Virat Kohli: టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ(Cricketer Virat Kohli) ఫ్యామిలీ ఎమర్జెన్సీ అంటూ విరాట్ కోహ్లి గువాహటి నుంచి నేరుగా ముంబై వెళ్లిపోయాడు. ప్రపంచకప్ కోసం టీమిండియా సన్నద్ధమవుతున్న సమయంలో.. అతడు వామప్ మ్యాచ్ ఆడతాడా లేదా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రపంచకప్ కోసం సన్నద్ధమవుతున్న టీమిండియా తన రెండోవామప్ మ్యాచ్ కోసం తిరువనంతపురం చేరుకుంది. అయితే, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టుతోపాటు అక్కడికి వెళ్లకుండా ముంబై వెళ్లినట్టు వార్తలు రావడంతో ఏం జరిగిందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. కోహ్లీ భార్య అనుష్కశర్మ రెండోసారి తల్లికాబోతున్నట్టు వార్తలు రావడం.. అదే సమయంలో కోహ్లీ ముంబై వెళ్లడంతో శుభవార్త చెప్పేందుకే కోహ్లీ ముంబై వెళ్లినట్టు అభిమానులు సోషల్ మీడియా ద్వారా చర్చించుకుంటున్నారు.
విరాట్ కోహ్లీ మరోసారి తండ్రి కాబోతున్నాడు. ఆయన భార్య, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ(Anushka Sharma) రెండోసారి బిడ్డకు జన్మనివ్వనుంది అని నెట్టింట్లో క్రికెట్ అభిమానులు హల్ చల్ చేస్తున్నారు. కొన్నిరోజుల క్రితం విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ దంపతులు ముంబైలోని ఓ గైనకాలజీ క్లినిక్‌కు కలిసి వచ్చారని వార్తలు వస్తున్నాయి. దీంతో అనుష్క శర్మ ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై తాము త్వరలో అధికారికంగా ప్రకటిస్తామని..మీడియా వాళ్లు దయచేసి ఫోటోలు తీయవద్దని కోహ్లీ-అనుష్క శర్మ దంపతులు రిక్వెస్ట్ చేసినట్లు టాక్. నవంబర్ 5న విరాట్ కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా ఈ శుభవార్తను పంచుకుంటారని అభిమానులు భావిస్తున్నారు.
కాగా, విరాట్ కోహ్లి ఇండియా ఆడే వామప్ మ్యాచ్ కు అందుబాటులో ఉంటాడా లేదా అన్న ఆసక్తి నెలకొంది. నెదర్లాండ్స్ తో ఇండియా తన రెండో వామప్ మ్యాచ్ ను మంగళవారం తిరువనంతపురంలో ఆడనుంది. దీనికోసం టీమ్ మొత్తం ఇప్పటికే గువాహటి నుంచి తిరువనంతపురం వెళ్లింది. అయితే కోహ్లి మాత్రం టీమ్ తోపాటు అక్కడికి వెళ్లలేదు.
Also Read: ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించిన మొనగాడు..కానీ ఇప్పుడు ప్చ్.. ఈ తోపు లేకుండానే వరల్డ్‌కప్!