cricket:స్కాలర్ షిప్ కోసం క్రికెట్ ఆడిన దక్షణాఫ్రికా ఆటగాడు! దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ నాండ్రే బెర్గర్ క్రికెట్ కెరీర్ చాలా ఆసక్తికరం. 15 ఏళ్ల వయసులో టెన్నిస్ ఆడాడు. ఉచితంగా చదువుకోవటం కోసం క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. దాంతో క్రికెట్ ఆడుతూ ఉన్నత విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందాడు. By Durga Rao 28 Mar 2024 in ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ New Update షేర్ చేయండి దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ నాండ్రే బెర్గర్ ( Nandre Berger)ప్రొఫెషనల్ క్రికెట్ ఆడాలని కలలో కూడా ఊహించలేదు. ఉచిత చదువుల కోసం ఎంచుకున్న క్రికెట్ తనని ఇంత దూరం తీసుకువస్తుందని అసలు ఊహించలేదు. అతను 2014లో జరిగిన క్రికెట్ ట్రయల్స్ ద్వారా విట్వాటర్‌రాండ్ విశ్వవిద్యాలయంలో పూర్తి స్కాలర్‌షిప్ తో ప్రవేశం పొందాడు. అప్పటి నుంచి అతను వెనుదిరిగి చూసుకోలేదు. 28 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ బర్గర్ మూడు ఫార్మాట్లలో దక్షిణాఫ్రికా ప్రధాన బౌలర్ గా దూసుకెళుతున్నాడు. గతేడాది డిసెంబర్‌లో జాతీయ జట్టులోకి అరంగేట్రం చేశాడు. లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ బర్గర్ ప్రస్తుతం ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నాడు. 2024 ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ బర్గర్‌ను రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది. నాండ్రే బర్గర్ గత నెలలో జరిగిన SA20లో జోహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్ తరపున కూడా ఆడాడు. ESPN క్రిక్ ఇన్ఫోతో , నాండ్రే బెర్గర్,మాట్లాడుతూ.. క్రికెట్ ఆడే విద్యార్థులకు విట్స్ స్కాలర్‌షిప్‌లు ఇస్తోంది. నేను క్రికెటర్‌ని కావాలనుకోలేదు కానీ ఉచిత విద్య కోసం బంతిని విసరటం ప్రారంభించాను. నా చదువుకు క్రికెట్ ఒక బ్యాక్‌అప్ అనుకున్న కాని నన్ను ఇంత దూరం తీసుకువస్తుందని కలలో కూడా అనుకోలేదు. నేను బంతి ని విసరటం ఆండ్రీ బెర్గర్ విశ్వవిద్యాలయ కోచ్ నీల్ లెవెన్సన్ గుర్తించాడు. నేను టెన్నీస్ ఛాంపియన్ షిప్ ఆడేటప్పుడు గంటకు 125 కిమీ వేగంతో బౌలింగ్ వేసేవాడిని. ఆతర్వాత మొదట నవ్వాను. ఆ తర్వాత క్రమంగా ప్రాక్టీస్ చేస్తూ.. 145 కిమీ వేగాన్ని అందుకున్నాను. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఈ సీజన్‌లో నాండ్రే బెర్గర్ ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. 15 సంవత్సరాల వయస్సులో, ప్రాంతీయ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లలో బెర్గర్ అతని వయస్సులో అగ్రశ్రేణి ఆటగాళ్ళలో ఒకడు. 17 సంవత్సరాల వయస్సులో, అతను దక్షిణాఫ్రికా నేషనల్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాడు. అయితే వెన్ను గాయం కారణంగా క్రికెట్ వైపు మొగ్గు చూపాడు. నాంద్రే బెర్గర్ దక్షిణాఫ్రికా తరపున 2 టెస్టులు, 3 ODIలు ,1 T20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. టెస్టుల్లో 11 వికెట్లు, వన్డేల్లో 5 వికెట్లు తీశాడు. టీ20లో బర్గర్‌కు 1 వికెట్ ఉంది. బర్గర్ 43 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 138 వికెట్లు పడగొట్టాడు.నాంద్రే బెర్గర్ దక్షిణాఫ్రికా తరపున 2 టెస్టులు, 3 ODIలు మరియు 1 T20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. టెస్టుల్లో 11 వికెట్లు, వన్డేల్లో 5 వికెట్లు తీశాడు. టీ20లో బర్గర్‌కు 1 వికెట్ ఉంది. బర్గర్ 43 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 138 వికెట్లు పడగొట్టాడు. #bowler #south-african #nandre-berger మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి