పాపం.. బ్రావో చెలరేగినా చెన్నై ఫ్రాంచైజీకి దక్కని విజయం!

మేజర్ లీగ్ క్రికెట్ (ఎం.ఎల్‌.సీ) - 2023 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజికి చెందిన టెక్సాస్ సూపర్ కింగ్స్‌కు తొలి పరాజయం ఎదురైంది. వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టెక్సాస్ 6 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో(39 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 76 నాటౌట్) ఎంత పోరాటం చేసి ఇన్నింగ్స్ ఆడినా మ్యాచ్‌ను గెలవలేకపోయింది.

New Update
పాపం.. బ్రావో చెలరేగినా చెన్నై ఫ్రాంచైజీకి దక్కని విజయం!

cricket-national-news-mlc-2023-dwayne-bravo-heroics-in-vain-as-washington-freedom-beat-texas-super-kings

స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో.. మరో బ్యాటర్ నుంచి సరైన సహకారం లభించకపోవడంతో తన జట్టు ఓటమికి తలవంచిందనే చెప్పాలి. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడమ్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు చేసింది. మాథ్యూ షార్ట్ (50 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 80) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. టెక్సాస్ బౌలర్లలో గెరాల్డ్ కోయిట్జీ (2/26) రెండు వికెట్లు తీయగా.. మిచెల్ సాంట్నర్, డ్వేన్ బ్రావో, మొహమ్మద్ మోహ్‌సిన్ తలో వికెట్ తీసి మ్యాచ్‌ను సరిపెట్టుకున్నారు.

8 వికెట్లకు 157 పరుగులే

అనంతరం... లక్ష్య చేధనకు దిగిన టెక్సాస్ సూపర్ కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులే చేసింది. డ్వేన్ బ్రావో మినహా మరే బ్యాటర్ రాణించలేదు. మార్కో జాన్సెన్, అకీల్ హోస్సెన్ రెండేసి వికెట్లు తీయగా.. సౌరభ్, హెన్రీక్స్, డేన్ తలో వికెట్ తీసారు. లక్ష్య చేధనలో టీఎస్‌కే ఓపెనర్లు దారుణంగా విఫలమయ్యారు. డేవాన్ కాన్వే (0) డకౌటవ్వగా.. ఫాఫ్ డుప్లెస్ (14), లాహిరు (15), డేవిడ్ మిల్లర్ (14), మిలింద్ కుమార్(3), దారుణంగా విఫలమవడంతో టీఎస్‌కే 50 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో డ్వేన్ బ్రావో, మిచెల్ సాంట్నర్ (22) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ అకీల్ హోసెన్ దెబ్బతీసాడు.

బ్రావో చెలరేగినా,ఫలితం శూన్యం

స్టార్టింగ్‌లో నిదానంగా ఆడిన బ్రావో ఆ తర్వాత.... ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తొలి 18 బంతుల్లో 10 పరుగులే చేసిన అతను తర్వాతి 21 బంతుల్లో 66 పరుగులు చేశాడు. మరోవైపు వికెట్లు పడుతున్నా.. విజయం కోసం ఒంటరి పోరాటం చేశాడు. అతని పోరాటానికి మరో ఎండ్‌లో సహకారం లభించకపోవడంతో టెక్సాస్ సూపర్ కింగ్స్‌కు ఓటమి తప్పలేదు. పేరుకే మేజర్ లీగ్ క్రికెట్ అయినా.. ఈ టోర్నీ మినీ ఐపీఎల్‌ను తలపిస్తోంది. మొత్తం 6 జట్లలో 4 టీమ్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీలకు చెందినవే కావడం విశేషం.

Advertisment
Advertisment
తాజా కథనాలు