Credit Card Myths and Facts: క్రెడిట్ కార్డుల విషయంలో ఈ డౌట్స్ తప్పు.. అపోహలు వద్దు.. 

క్రెడిట్ కార్డుల విషయంలో చాలామందికి అపోహలు ఉంటాయి. కానీ, జాగ్రత్తగా వాడితే క్రెడిట్ కార్డు ఆపదలో ఆదుకునే స్నేహితుడి లాంటిది. అందుకే క్రెడిట్ కార్డుల విషయంలో ఉన్న అపోహలు.. సందేహాలు టైటిల్ పై క్లిక్ చేసి ఈ ఆర్టికల్ ద్వారా తీర్చుకునే ప్రయత్నం చేద్దాం.

New Update
Credit Card Myths and Facts: క్రెడిట్ కార్డుల విషయంలో ఈ డౌట్స్ తప్పు.. అపోహలు వద్దు.. 

Credit Card Myths and Facts: ఒక ప్రయివేట్ కంపెనీలో పనిచేస్తున్న హైదరాబాద్ కు చెందిన రాజేష్ ఒక క్రెడిట్ కార్డు యూజ్ చేస్తున్నాడు. అయితే, చాలా కాలంగా మరో క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు. కానీ, ఇప్పటి వరకు తీసుకోలేదు. మరో క్రెడిట్ కార్డ్ తీసుకుంటే తన క్రెడిట్ స్కోర్ చెడిపోతుందని అతను భయపడుతున్నాడు. రాజేష్ భయం కరెక్టేనా? రాజేష్ లానే క్రెడిట్ కార్డు విషయంలో చాలామందికి అపోహలు, భయాలు ఉంటాయి. వాటిని ఇక్కడ తీర్చుకునే ప్రయత్నం చేద్దాం. 

Credit Card Myths and Facts: నిజానికి క్రెడిట్ కార్డు అంటే జాగ్రత్తగా వాడుకుంటే, అవసరానికి ఆదుకునే స్నేహితుల వంటివి. కార్డిస్ కార్డు పద్ధతిగా ఉపయోగించుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది.  చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్‌లు ఉంటాయి. కొంతమందికి 3-4 కార్డులు కూడా ఉండడం చూడొచ్చు. మరి రాజేష్ లాజిక్ ప్రకారం ఇలాంటి వారి క్రెడిట్ స్కోర్ చాలా చెడ్డదిగా ఉంటుందా? అంటే, కాదనే చెప్పొచ్చు. రాజేష్ ఏమనుకుంటున్నాడో అది అపోహ మాత్రమే. క్రెడిట్ కార్డ్స్ సరిగ్గా వాడటం ముఖ్యం, ఇలా చేస్తూనే ఉంటే 2, 5 కార్డ్స్ ఉన్నా క్రెడిట్ స్కోర్ దిగజారదు.. పైగా బాగుపడుతుంది. 

Also Read: పెట్రోల్-డీజిల్ ధరలు తగ్గేది అప్పుడేనా? ప్రభుత్వం ఏమంటోంది?

Credit Card Myths and Facts: ఒకటి కంటే ఎక్కువ ఉంటే..
ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను కలిగి ఉండటం క్రెడిట్ స్కోర్‌ను పాడు చేస్తుంది అనేది అపోహ అని చెప్పుకున్నాం కదా. నిజానికి, బ్యాంకులు క్రెడిట్ యుటిలైజేషన్ నిష్పత్తి అంటే CURపై శ్రద్ధ చూపుతాయి. ఇది మీ కార్డ్‌పై క్రెడిట్ పరిమితి..  మీరు ఉపయోగించిన క్రెడిట్ మొత్తం నిష్పత్తి. మీరు ఒక కార్డ్‌లో గరిష్టంగా ఈ నిష్పత్తిని ఉపయోగిస్తే, అది మీ క్రెడిట్ యోగ్యత గురించి అంటే రుణం తీసుకునే సామర్థ్యం గురించి నెగెటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది.  మీకు ఒకటి కంటే ఎక్కువ కార్డులు ఉంటే, మీరు మీ ఖర్చులను విభజించవచ్చు. దీనితో, ఈ నిష్పత్తి ప్రతి కార్డుపై సరైన పరిమితిలోనే ఉంటుంది. కాబట్టి ఒకటి కంటే ఎక్కువ కార్డులు కలిగి ఉండటం చెడ్డ విషయం కాదు.

Credit Card Myths and Facts: చెడ్డ క్రెడిట్ స్కోర్‌కు కారణాలు
రెండవ అపోహ ఏమిటంటే, మొత్తం క్రెడిట్ కార్డ్ బిల్లును ఒకేసారి పేమెంట్ చేస్తే, గడువు తేదీకన్నా ఆలస్యంగా చెల్లించినా ఫర్వాలేదు అనుకుంటారు.  నిజమేమిటంటే, మీరు పూర్తి మొత్తాన్ని చెల్లించినప్పటికీ, గడువు తేదీలో బిల్లు పేమెంట్ మిస్ కావడం మీ క్రెడిట్ స్కోర్‌ను దెబ్బతీస్తుంది. దీనిని మంచి క్రెడిట్ ప్రవర్తనగా పరిగణించరు. ఇది కాకుండా మీరు లేట్ ఫీజులు.. వడ్డీని కూడా చెల్లించాల్సి వస్తుంది. 

Credit Card Myths and Facts: మినిమమ్ పేమెంట్ చేస్తూ పొతే ఏమవుతుంది?
మూడవ అపోహ ఏమిటంటే, ప్రతి నెలా కనీస బకాయి మొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుంది. ఇది క్రెడిట్ కార్డ్‌లకు సంబంధించిన అతిపెద్ద అపోహ.  చాలా మంది ఇలా చేస్తారు. కనీస బకాయిని చెల్లించడం ద్వారా, మీరు ఆలస్య చెల్లింపు పెనాల్టీ నుండి మాత్రమే సేవ్ చేయబడతారు. కానీ, మిగిలిన బకాయి బ్యాలెన్స్‌పై వడ్డీ పడుతుంది. లావాదేవీ తేదీ నుండి ఈ వడ్డీ వసూలు చేయబడుతుంది. ఇది మీ క్రెడిట్ కార్డ్ బిల్లును గణనీయంగా పెంచుతుంది.

Credit Card Myths and Facts: క్రెడిట్ లిమిట్..
నాల్గవ అపోహ ఏమిటంటే, మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడం వల్ల మీ ఖర్చులు పెరుగుతాయి. నిజం ఏమిటంటే, బ్యాంకు మీ పరిమితిని పెంచినట్లయితే అది మంచి విషయమే. అంటే మీరు మీ క్రెడిట్ కార్డును చాలా బాధ్యతాయుతంగా ఉపయోగిస్తున్నట్లయితే, బ్యాంకు మిమ్మల్ని మంచి కస్టమర్‌గా పరిగణిస్తుంది. మేము ముందే చెప్పినట్లుగా, అధిక క్రెడిట్ పరిమితి మీ క్రెడిట్ వినియోగ నిష్పత్తిని తక్కువగా ఉంచడంలో మీకు సహాయం చేస్తుంది.

Credit Card Myths and Facts: వార్షిక రుసుము వసూలు చేసే కార్డులు ఖరీదైనవా?
ఐదో అపోహ ఏమిటంటే, వార్షిక రుసుము వసూలు చేసే కార్డులు ఖరీదైనవి. నిజం ఏమిటంటే, వార్షిక రుసుమును వసూలు చేసే కార్డ్‌లు సాధారణంగా ఎక్కువ రివార్డ్ పాయింట్‌లను అందిస్తాయి. మీకు డిస్కౌంట్‌లు, ఆఫర్‌లను అందించే ఇతర బ్రాండ్‌లతో టై-అప్‌లను కలిగి ఉంటాయి. విమానాశ్రయంలో ఉచిత లాంజ్ యాక్సెస్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇది కాకుండా, అనేక కార్డులలో సంవత్సరానికి నిర్ణీత మొత్తాన్ని ఖర్చు చేసిన తర్వాత వార్షిక రుసుము కూడా మాఫీ చేస్తారు. 

Credit Card Myths and Facts: క్రెడిట్ కార్డ్‌ని క్లోజ్ చేస్తే క్రెడిట్ స్కోర్ మెరుగుపడుతుందా?
మీరు క్రెడిట్ కార్డును మూసివేస్తే, మీ క్రెడిట్ స్కోర్ మెరుగుపడుతుందని మరొక అపోహ. ఇది అస్సలు జరగదు. నిజం ఏమిటంటే, మీరు మీ క్రెడిట్ కార్డ్‌ని రద్దు చేస్తే, మీ క్రెడిట్‌ని యాక్సెస్ చేయడంలో బ్యాంక్ ఇబ్బందిని ఎదుర్కొంటుంది, ఇది మీకు ఎప్పుడైనా లోన్స్ పొందడం కష్టతరం చేస్తుంది.

అందువల్ల, ఈ అపోహలకు పోవద్దు.  క్రెడిట్ కార్డ్ 1 అయినా 4 అయినా, దాన్ని సరిగ్గా ఉపయోగించడం ముఖ్యం. సరైన ఉపయోగంతో, మీ ఆర్థిక ఆరోగ్యం బాగానే ఉంటుంది. కాబట్టి, మీరు పూర్తి విచక్షణతో కార్డును ఉపయోగించడం చాలా ముఖ్యం.

Advertisment
Advertisment
తాజా కథనాలు