The Birthday Boy : ఓటీటీలోకి క్రేజీ సస్పెన్స్ థ్రిల్లర్.. 'ది బర్త్ డే బాయ్' స్ట్రీమింగ్ డేట్ ఇదే! రవికృష్ణ, సమీర్ మళ్లా హీరోలుగా నటించిన లేటెస్ట్ మూవీ 'ది బర్త్‌డే బాయ్' ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. ఈ నెల 9 నుంచి 'ఆహా' ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు 'ఆహా' ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. By Anil Kumar 09 Aug 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి The Birthday Boy Movie : రవికృష్ణ, సమీర్ మళ్లా హీరోలుగా నటించిన లేటెస్ట్ మూవీ 'ది బర్త్‌డే బాయ్'. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా జులై 19న థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయినా.. ఆడియన్స్ నుంచి సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది.. ఈ నెల 9 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన ఆహాలో 'ది బర్త్‌డే బాయ్' స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు 'ఆహా' ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. విస్కీ దాసరి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మ్యూజిక్‌కు ప్రశాంత్ శ్రీనివాస్ బాణీలు అందించారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీలోని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. థియేటర్స్ లో పర్వాలేదనిపించుకున్న ఏ సినిమా ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్ రాబట్టుకునే అవకాశాలు ఉన్నాయి. Also Read : ‘తంగలాన్’ లో తల్లి పాత్ర పోషించడం పై స్పందించిన యంగ్ హీరోయిన్..! An unforgettable day for the..🙅🏻♂️ #Thebirthdayboy 🎂 premieres August 9th at 2 PM only on aha @actorsameersamo @rajeevco @pramodini15 @MAniGoudMG @vikranthved @Rchilam pic.twitter.com/S5yl6N4n29 — ahavideoin (@ahavideoIN) August 8, 2024 సినిమా కథ విషయానికొస్తే... అర్జున్, వెంకట్, బాలు, సత్తి, సాయి ఐదుగురు కుర్రాళ్లు అమెరికాలో చదువుకుంటూ ఉంటారు. వీళ్లలో బాలు పుట్టినరోజుని బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ సెలబ్రేషన్స్‌లో బర్త్ డే బంప్స్ అని చెప్పి బాలుని ఎలా పడితే అలా కొడతారు. నొప్పి తట్టుకోలేక బాలు చనిపోతాడు. ఉన్నది అమెరికా కావడంతో కుర్రోళ్లు భయపడతారు. వీళ్లందరూ అర్జున్ సోదరుడు భరత్ (రవికృష్ణ)ని పిలుస్తారు. లాయర్ అయిన ఇతడు.. చనిపోయిన బాలు తల్లిదండ్రులకు విషయం చెప్పి అమెరికా రప్పిస్తాడు. ఇంతకీ బాలు చనిపోయాడా చంపేశారా? చివరకు ఏమైందనేది సినిమా.. #the-birthday-boy-movie మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి