యాపిల్ కంపెనీ లేటెస్ట్ ఐఫోన్ 15 (iPhone 15) సిరీస్ ప్రస్తుతం మార్కెట్లో ఉంది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ సిరీల్ లాంచ్ అయింది. తర్వాత క్రమంగా ఈ లైనప్‌లోని నాలుగు వేరియంట్ల ధరలు తగ్గాయి. అలాగే పాత తరం ఐఫోన్ 14 (iPhone 14) ధరలు సైతం తగ్గాయి. ఇప్పుడు ఇ-కామర్స్ కంపెనీలు దీనిపై క్రేజీ ఆఫర్స్ అందిస్తున్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో దీన్ని రూ.55,000 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.ఆఫర్ల వివరాలు చెక్ చేయండి.అంతకుముందు దీని ధర రూ.75000 గా ఉంది. ప్రస్తుతం అమెజాన్‌లో ఐఫోన్ 14 (128 GB) కేవలం రూ. 58,999కి అందుబాటులో ఉంది. అయితే, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా SBI క్రెడిట్ కార్డుతో ఈ హ్యాండ్‌సెట్ కొంటే, ఫోన్‌పై రూ. 3000 డిస్కౌంట్ పొందవచ్చు. దీనిపై అమెజాన్ బెస్ట్ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ అందిస్తోంది. పాత ప్రీమియం ఫోన్‌ను ట్రేడ్ ఇన్ చేస్తే, కొత్త ఐఫోన్ 14పై రూ. 36,350 వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పొందవచ్చు. నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్లు సైతం ఉన్నాయి.
ఫ్లిప్‌కార్ట్‌లో 128 GB ఐఫోన్ 14, స్టార్‌లైట్ ఎడిషన్ ఇప్పుడు రూ. 58,999కి లిస్ట్ అయింది. అంటే దీనిపై ఇ-కామర్స్ కంపెనీ 15 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. వివిధ బ్యాంక్ ఆఫర్లు కలిపి కస్టమర్లకు రూ.3,000 డిస్కౌంట్ లభిస్తుంది. దీనిపై ఫ్లిప్‌కార్ట్ ఏకంగా రూ.48,000 ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ సైతం అందిస్తోంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అందించే ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటే.. ఐఫోన్ 14ను రూ.55వేల కంటే తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు.యాపిల్ ఐఫోన్ 14 స్లిమ్ బార్డర్స్‌తో, 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది మంచి విజువల్స్‌ను అందిస్తుంది. ఈ డిస్‌ప్లే HDR కంటెంట్‌కు సపోర్ట్ చేస్తుంది, వివిధ రకాల కలర్స్ డిస్‌ప్లే చేస్తుంది. 1200-నిట్ పీక్ బ్రైట్‌నెస్ దీని సొంతం. ఐఫోన్ 14లో A15 బయోనిక్ చిప్ ఉంటుంది. ఇది ఫాస్టెస్ట్ పర్ఫార్మెన్స్‌తో బెస్ట్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ 128GB, 256GB, 512GB స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తుంది. సరికొత్త iOS 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో డివైజ్ రన్ అవుతుంది.
ఐఫోన్ 14లో డ్యుయల్ కెమెరా సెటప్ ఉంది. దీంట్లోని 12MP ప్రైమరీ కెమెరా తక్కువ లైటింగ్‌లో కూడా బెస్ట్ ఫోటోలను క్యాప్చర్ చేస్తుంది. ఈ డివైజ్‌లో 12MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఉంది. ఈ కెమెరా సెటప్ డాల్బీ విజన్‌తో హై క్వాలిటీ వీడియోలను రికార్డ్ చేయగలదు. 5G కనెక్టివిటీతో ఇది ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ ఆఫర్ చేస్తుంది. వైఫై, డ్యుయల్ సిమ్, బ్లూటూత్, GPS, లైటెనింగ్ పోర్ట్ ఛార్జింగ్, సేఫ్ అన్‌లాకింగ్ కోసం ఫేస్ ఐడి వంటి ఫీచర్లు దీంట్లో ఉన్నాయి.