Vastu Tips : ఈ మొక్కను క్యాష్ కౌంటర్ వద్ద పెట్టండి.. ఇక డబ్బే డబ్బు..! క్రాసులా మొక్కను ఆఫీస్ లేదా షాప్ క్యాష్ కౌంటర్ వద్ద పెట్టుకుంటే రెట్టింపు లాభాలు వస్తాయని వాస్తుశాస్త్రం చెబుతోంది. అటు ఉసిరి మొక్కకు క్రమం తప్పకుండా నీరు ఇవ్వడం వల్ల బాధలు తొలగిపోయి సంపద లభిస్తుందట. By Trinath 19 Feb 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Vastu Tips For Money : దేశంలో వాస్తును నమ్మేవారి సంఖ్య చాలా ఎక్కువే ఉంటుంది. వాస్తు సరిగ్గా లేకపోవడం వల్లే తమకు కష్టాలని భావించేవారు ఉంటారు. వాస్తును మంచిగా సెట్ చేసుకోవడానికి చాలా డబ్బులు ఖర్చు పెడతారు కూడా. జీవితంలో ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలు ఉండాలనుకుంటారు. వాస్తు శాస్త్రంలో కొన్ని చెట్లు, మొక్కలు లక్‌ను తీసుకొస్తాయి. ఇవి ఇంట్లో ఆనందం, శ్రేయస్సును తెస్తాయి. ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తాయి. వాస్తు(Vastu Tips) ప్రకారం ఇంట్లో లేదా చుట్టుపక్కల ఏయే మొక్కలను నాటాలో తెలుసుకుందాం! కరివేపాకు(Curry Leaves) : ఇది ఇంటికి పాజిటివ్ ఎనర్జీ(Positive Energy) ని తీసుకురావడంతో పాటు నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. ఈ మొక్కను ఇంటికి ఉత్తర దిశలో నాటాలి. దీని వల్ల జీవితంలో పురోగతి ఉంటుంది. అంతేకాదు లైఫ్ కొత్త దారులో నడుస్తుంది. ఈ దిశలో నాటిన ఈ మొక్క మీ వ్యాపారాన్ని మెరుగుపరుస్తుంది. క్రాసులా(Crassula) : ఈ మొక్కను ఇంట్లో పెట్టుకోవడం వల్ల సంపద(Money) కు కొత్త మార్గాలు తెరుచుకుంటాయట. ఇంటి ప్రవేశ ద్వారం కుడి వైపున క్రాసులా(Crassula) ను ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. ఆఫీస్ లేదా షాప్ క్యాష్ కౌంటర్ వద్ద ఈ మొక్కను ఉంచవచ్చు. దీనివల్ల రెట్టింపు డబ్బు వస్తుందని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఉసిరి(Amla) : ఉసిరి చెట్టును చాలా పవిత్రంగా భావిస్తారు. ఇది నెగిటివ్ ఎనర్జిని రిమూవ్ చేసి పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది. ఈ మొక్క ఇంట్లో సంపదను పెంచుతుందట. ఉసిరి చెట్టులో విష్ణువు, లక్ష్మీదేవి నివసిస్తారని ప్రతీతి. మీరు ఇంట్లో ఉసిరి చెట్టును నాటుతుంటే దానిని ఉత్తర, తూర్పు లేదా ఈశాన్య దిశలో నాటవచ్చు. ఈ మొక్కకు క్రమం తప్పకుండా నీరు ఇవ్వడం వల్ల బాధలు తొలగిపోయి సంపద లభిస్తుందని వాస్తు శాస్త్రం అంటోంది. శ్వేతార్క్(Shwetark) : ఈ మొక్కను వినాయకుని రూపంగా భావిస్తారు. ఈ మొక్కకు పసుపు, అక్షింతలు, నీరు సమర్పించడం వల్ల ఇంటికి శుభాలు కలుగుతాయట. గమనిక: వాస్తు చిట్కాలు నిజమైనదని చెప్పడానికి ఎలాంటి శాస్త్రియ ఆధారాలు లేవు. ఈ ఆర్టికల్‌ను ఆర్టీవీ ధృవీకరించడంలేదు. ఈ కథనం కేవలం ఇంటర్‌నెట్‌లో సమాచారం ఆధారంగానే ఇవ్వబడిందని గమనించగలరు. Also Read : ఓటమి తర్వాత తొలిసారిగా ఢిల్లీకి కేసీఆర్.. కారణం అదేనా.. #vastu-tips #curry-leaves-benefits #astro-money-tips #crassula-plant మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి