తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికే బీఆర్‌ఎస్,కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేశాయి. అయితే ఇప్పుడు తాజాగా సీపీఎం పార్టీ 14 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీతో పొత్తు కోసం సీపీఎం ప్రయత్నాలు చేసిన అవి ఫలించలేదు. మిర్యాలగూడ, వైరా స్థానాలను ఇవ్వాలని సీపీఎం కాంగ్రెస్‌ను కోరింది. కానీ హస్తం పార్టీ నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో 17 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని సీపీఎం ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా 14 మంది అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. మరో మూడు స్థానాలకు అభ్యర్థులను ఆదివారం సాయంత్రం ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు.
అభ్యర్థులు వీళ్లే..
1. కారం పుల్లయ్య (ST) - భద్రాచలం
2. పిట్టల అర్జున్ (ST) - అశ్వారావుపేట్
3. తమ్మినేని వీరభద్రం - పాలేరు
4. పలగుడు భాస్కర్ (SC) - మధిర
5. భూక్య వీరభద్రం (ST) - వైరా
6. ఎర్ర శ్రీకాంత్ - ఖమ్మం
7. మాచర్ల భారతి (SC) - సత్తుపల్లి
8. జూలకంటి రంగారెడ్డి - మిర్యాలగూడెం
9. బొజ్జ చినవెంకులు (SC) - నకిరేకల్
10. కొండమడుగు నర్సింహ - భువనగిరి
11. మోకు కనకారెడ్డి - జనగాం
12. పగడాల యాదయ్య - ఇబ్రహీంపట్నం
13. మల్లిఖార్జున్ - పటాన్‌చెరు
14. ఎం. దశరథ్ - ముషీరాబాద్