కాంగ్రెస్ తో (TS Congress) పొత్తుకు సీపీఎం (CPM) కటీఫ్ చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బీజేపీ(BJP), బీఆర్ఎస్ (BRS) ను వ్యతిరేకిస్తూనే కాంగ్రెస్ తో స్నేహపూర్వక పోటీకీ సీపీఎం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పాలేరు, భద్రాచలం, వైరా, మిర్యాలగూడ, ఇబ్రహీంపట్నంలో పోటీకి అవకాశం ఇవ్వాలని సీపీఎం కాంగ్రెస్ ను కోరుతోంది. అయితే.. ఆ స్థానాలను ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సుముఖత చూపకపోవడంతో పొత్తుకు దూరంగా ఉండాలని సీపీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి మినహా మిగిలిన నియోజకవర్గాల్లో పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: TS Politics: కాంగ్రెస్ పార్టీకి షాక్.. బీఆర్ఎస్ గూటికి ఎర్ర శేఖర్!
సీపీఐ నేతలతో భేటీ అనంతరం ఐక్యంగా పోటీచేయడంపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీపీఐ, సీపీఎం పార్టీలు తమకు చెరో ఐదు స్థానాలు ఇవ్వాలని మొదటి నుంచి పట్టుబడుతున్నాయి. కానీ, కాంగ్రెస్ మాత్రం చెరో రెండు స్థానాలను మాత్రమే ఇస్తామని చెబుతూ వస్తోంది. అయితే.. సీపీఐకి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జనరల్ సీట్ అయిన కొత్తగూడెంను కేటాయించాలని కాంగ్రెస్ నిర్ణయానికి వచ్చింది.
ఇది కూడా చదవండి: TS Elections 2023: బిగ్ ట్విస్ట్.. పాలేరు బరిలో వైఎస్ విజయమ్మ..కొత్తగూడెం నుంచి షర్మిల!
సీపీఎం కూడా జిల్లాలోని మరో జనరల్ సీటు అయిన పాలేరు తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. కానీ, కాంగ్రెస్ మాత్రం అందుకు అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ నేతలు అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. పాలేరు నుంచి పోటీ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం భావిస్తున్నారు. ఎలాగైనా అక్కడి నుంచి బరిలోకి దిగాలని ఆయన డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.