AP: కేంద్ర బడ్జెట్‌పై సీపీఎం నేతల ఆందోళన..! కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు మొండిచేయి చూపించారంటూ సీపీఎం నాయకులు ఆందోళన చేపట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంటుపై స్పష్టత ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పక్కన పెట్టిందని విమర్శలు గుప్పించారు. By Jyoshna Sappogula 25 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ విజయనగరం New Update షేర్ చేయండి Vizianagaram: విజయనగరం జిల్లాలో సీపీఎం నేతలు ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు మొండిచేయి చూపించారంటూ సీపీఎం నాయకులు రోడ్డెక్కారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కేంద్రం పక్కప పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంటుపై స్పష్టత ఇవ్వలేదని.. బడ్జెట్లో సుజుల స్రవంతిని మరిచారని అన్నారు. జిల్లాలో ప్రముఖ గిరిజన యూనివర్సిటీకి ఎటువంటి నిధులను కేటాయించలేదని మండిపడ్డారు. కేంద్రం ఇదే ధోరణి కొనసాగితే రానున్న రోజుల్లో వామపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. #vizianagarm మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి