CPI: 'ఈ సీఎంకు కనీసం సిగ్గుందా?' సీపీఐ రాష్ట్ర కార్యదర్శి షాకింగ్ కామెంట్స్.!

తుపాను వల్ల నష్టపోయిన పొలాలను సీఎం జగన్ పరిశీలించకపోవడంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 'ఈ సీఎంకు కనీసం సిగ్గుందా?' అని ప్రశ్నించారు. 440 మండలాల్లో కరవు ఉంటే ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

CPI K Ramakrishna: ఇనాళ్లు జగన్.. ఇప్పుడు గవర్నర్.. సీపీఐ రామకృష్ణ సీరియస్ కామెంట్స్
New Update

Vijayawada: తుపాన్ వల్ల రైతాంగం పూర్తిగా నష్టపోయిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దాదాపు 440 మండలాల్లో కరవు ఉంటే జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఈ సీఎంకు కనీసం సిగ్గుందా?' అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు అందరి తలపై చేయి వేసి అప్యాయంగా పలకరిస్తూ అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చాడని.. ఇప్పుడేమో నష్టపోయిన రైతుల పొలాల్లో దిగకుండా షో చేస్తున్నాడని విమర్శలు గుప్పించారు.

Also Read: ‘సమ్మె బాటపై శాంతించని అంగన్వాడీలు..పట్టించుకోని ప్రభుత్వం’.!

రాష్ట్రంలో తుపాను వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కనీసం పొలాలను పరామర్శించ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు పరామర్శించలేదు?  పొలాలను పరిశీలించేది ఎలాగో నీకు తెలియదా? అని ప్రశ్నించారు. ఓట్లు కోసం ఎత్తులు వేశావు.. ఇతర ప్రజలను, రైతులను చిత్తు చేశావని సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Also Read: ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్ ఎప్పుడు? కీలక అప్‌డేట్స్ మీకోసం..

కరవు, తుపాను ప్రాంత రైతుల పిల్లలకు ఫీజు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రులు క్షేత్ర స్థాయిలో పంట నష్టం పరిశీలించాలని..వారికి నష్ట పరిహరం చెల్లించాలని అన్నారు. ఈ క్రమంలోనే తుపాను వల్ల కలిగిన నష్టం వివరాలను కేంద్ర బృందాలను కలిసి వారికి అందచేస్తామని తెలిపారు. ఢిల్లీ స్థాయిలో అందరినీ కలుపుకుని పోరాటాన్ని ఉధృతం చేస్తామని వెల్లడించారు.

#andhra-pradesh #cm-jagan #cpi-state-secretary-ramakrishna
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe