కాంగ్రెస్తో క్రామేడ్లు కటీఫ్..? ఇదే కారణమంటోన్న సీపీఐ..!! కామ్రేడ్లతో కాంగ్రెస్ పొత్తుపై సరికొత్త ఎత్తుగడ వేసింది. వామపక్షాలకు సీట్లు కేటాయింపుపై కాంగ్రెస్ విముఖతతో ఉన్నట్లుగా తెలుస్తోంది. సీపీఎం, సీపీఐకి చెరో రెండు ఎమ్మెల్సీలు..అధికారంలోకి వచ్చాక మంత్రివర్గంలో చోటు కల్పించాలని నిర్ణయం తీసుకుంది. వామపక్షాలు అడుగుతున్న 4స్థానాల్లో తమకే విజయావకాశాలు ఉన్నాయన్న భావనలో ఏఐసీసీ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ తో కటీఫ్ చేసుకునే యోచనలో సీపీఎం ఉన్నట్లు సమాచారం. By Bhoomi 31 Oct 2023 in తెలంగాణ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి కాంగ్రెస్ తో వాపపక్షాలు తెగదెంపులు చేసుకుంటున్నాయా? పొత్తు నుంచి వైదొలిగి సొంతంగా పోటీ చేయటానికి సిద్ధమవుతున్నాయా? వామపక్షాలకు చెరో రెండు సీట్లు ఇస్తామని ముందు మాట ఇచ్చిన కాంగ్రెస్ ఆ హామీ నుంచి పక్కకు తొలిగి కమ్యూనిస్టులకు మొండి చెయ్యి చూపిందా? తాజా పరిణామాలన్నీ అవుననే చెబుతున్నాయి. వామపక్షాలు కోరుతున్న నాలుగుస్థానాల్లో తమకే విజయావకాశాలు ఉన్నాయని ఏఐసీసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో వామపక్షాలతో పొత్తులో సరికొత్త ఎత్తుగడ ను ప్రదర్శించినట్టు చెబుతున్నారు. దీనితో చెరో రెండు ఎమ్మెల్సీలు, అధికారంలోకి వచ్చాక మంత్రివర్గంలో చోటు కల్పించాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు. దీనితో కంగుతిన్న వామపక్షాలు కాంగ్రెస్ తో తెగదెంపులు చేసుకోవటానికి సిద్ధమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది స్థానాల్లో పోటీ చేసేందుకు సీపీఏం కార్యాచరణ రూపొందించుకుంటోంది. ఇక సీపీఐ నేతలు బుధవారం సమావేశం అవుతున్నారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ వివేక్ కోసం చెన్నూరు.. జలగం కోసం కొత్తగూడెం స్థానాలు కేటాయించాలనే యోచన చేస్తోంది. అంతలోనే మారిన సమీకరణాలు: కాంగ్రెస్ రెండో జాబితా కోసం కసరత్తు చేస్తున్న సమయంలోనే లెఫ్ట్ పార్టీలతో పొత్తు దాదాపు ఖరారు అయిందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ వెల్లడించారు. కాంగ్రెస్‌ను సీపీఐ, సీపీఎం చేరో అయిదు స్థానాలు కోరగా చెరో రెండు స్థానాలు ఇచ్చేందుకు హస్తం నేతలు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు కేటాయించగా.. సీపీఎంకి మిర్యాలగూడతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైరా సీటును ఇచ్చేందుకు అంగీకరించారని సమాచారం. వామపక్షాలు తమకు ప్రాబల్యం ఉన్న ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలో సీట్లు కోరటం, ఈ రెండు ప్రాంతాల్లో కాంగ్రెస్ కీలక నేతలు పోటీలో ఉండటంతో సీట్ల పంచాయతీ ఏర్పడింది. వామపక్షాలు అడిగిన ఒక సీటు ఇచ్చి మరొక సీటు కాంగ్రెస్ అనుకున్నది ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. సీపీఐ కొత్తగూడెం, దానికి తోడుగా చెన్నూరు ఇచ్చేందుకు కాంగ్రెస్ మొగ్గు చూపింది. సీపీఎంకు సంబంధించి మిర్యాలగూడతో పాటు పాలేరు కావాలని పట్టుబట్టగా పాలేరు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పి ఖమ్మం జిల్లాలోనే వైరా సీటును కేటాయిస్తామని స్పష్టం చేసింది. ఈ ప్రతిపాదనలకు వామ పక్షాలు సైతం మౌఖికంగా సరే అన్నాయి. మునుగోడు సీటు తమకు కేటాయించాల్సిందేనని సీపీఐ నల్గొండ నేతలు తొలుత పట్టుబట్టారు. కొత్తగూడెం నుంచి కూనంనేని సాంబశివరావు, చెన్నూరు నుంచి చంద్రశేఖర్ బరిలోకి దిగుతారన్న ప్రచారం అయ్యింది. మరోవైపు సీపీఎం తరపున మిర్యాలగూడ నుంచి జూలకంటి రంగారెడ్డి, వైరా నుంచి భూక్య వీరభద్రం పోటీలో ఉంటారన్న వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వామపక్షాలకు సీట్లు కేటాయించవద్దని, తమకు విజయావకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు అధిష్టానానికి విన్నపాలు పంపారు. మిర్యాలగూడ సీటు సీపీఎంకు ఇవ్వొద్దని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం సీట్ల కేటాయింపులో మార్పులు చేసుకున్నట్టు, వామపక్షాల పొత్తుపైన తన వైఖరిని మార్చుకున్నట్టు చెబుతున్నారు. కాంగ్రెస్ లో చేరికలు ఎక్కువ కావటంతో .. ఆయా నేతలకు నియోజకవర్గాల్లో సీట్లు కేటాయించటం కాంగ్రెస్ అధిష్టానానికి సవాలుగా మారింది. మారిన పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ లోకి వస్తున్న వివేక్, జలగం లకు చెన్నూరు, కొత్తగూడెం స్థానాలను కేటాయించనున్నారని సమాచారం. ఇది కూడా చదవండి: ఈ డ్రైఫ్రూట్ ఆరోగ్యానికి మంచిదని అతిగా తింటున్నారా? ఈ సమస్యలు వస్తాయ్ జాగ్రత్త.!! #congress-vs-left మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి